వైరల్‌ : విమానంతో ప్రేమ, పిచ్చి ముదిరి పెళ్లికి కూడా రెడీ అవుతోంది

ప్రేమ అనే పదం వినిపించగానే ప్రతి ఒక్కరు కూడా ఆమ మగ మద్య ఒక రిలేషన్‌ అంటారు.అమ్మాయి అబ్బాయిల మద్య ప్రేమ చాలా బాగుంటుంది.

 A Woman Relationship With Airplane And She Is Going To Marry Plane-TeluguStop.com

అలా కాకుండా విభిన్నంగా ఉంటే మాత్రం కాస్త తేడాగానే అంతా చూస్తూ ఉంటారు.అమ్మాయి, అమ్మాయి మద్య లేదంటే అబ్బాయి అబ్బాయి మద్య ప్రేమ ఉంటే వారి ప్రేమకు కొత్త పేరు పెడతారు.

ప్రేమ అంటే వస్తువులతో కూడా కలిగి ఉండేది అంటూ చాలా మంది అనుకుంటూ ఉంటున్నారు.

Telugu Love, Airoplane Love-

  చాలా మంది తమకు ఇష్టమైన వస్తువులతో ప్రేమలో పడతారు.కాని బెర్లిన్‌ మాత్రం ఒక విమానంతో ప్రేమలో పడింది.ఆమె ప్రేమ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఆమెను ఒక పిచ్చిది అంటూనే ఆమె గురించి సోషల్‌ మీడియాలో కొందరు తెగ ప్రచారం చేస్తున్నారు.ఈ ప్రపంచంలో ఎంతో మంది మనుషులు ఉన్నా కూడా ఆమెకు మాత్రం విమానంతోనే ప్రేమ కలిగింది.

ఆమె తన ప్రేమ గురించి అందరికి నిర్మొహమాటంగా చెప్పేస్తుంది.

Telugu Love, Airoplane Love-

  ఇంతకు ఆమె ప్రేమించిన వస్తువు ఏంటో తెలుసా.విమానం.ఔను మీరు విన్నది నిజమే ఆమె విమానంతో ప్రేమలో పడింది.

ఆమె విమానంను ప్రేమిస్తోంది.ఆ విమానం కోసం ఏం చేసేందుకు అయినా సిద్దం అవుతుంది.

బోయింగ్‌ 737 – 800 ను చూడగానే ప్రేమించేసిందట.ప్రతి రోజు ఆ విమానం తాలూకు జ్ఞాపకాలతో బతికేస్తుంది.

ఆ విమానంను ముద్దు పెట్టుకోవడం, ఆ విమానంను హగ్‌ చేసుకోవడం చేస్తుందట.

తన ప్రేమ గురించి ఆమె మాట్లాడుతూ.

నా ప్రియుడిని అన్ని వేళల్లో కలవడం కుదరదు.అప్పుడప్పుడు చూసుకుంటూ ఆ జ్ఞాపకాలతో బతికేస్తున్నాను.

నేను నా ముద్దుల విమానంకు స్కాట్‌ అని పేరు పెట్టుకున్నాను.స్కాట్‌ను ప్రతి రోజు చూడాలని కోరుకుంటాను.

కాని అది సాధ్యం కాదు.అందుకే స్కాట్‌లా ఒక చిన్న విమానంను తయారు చేయించుకుంటున్నాను.

Telugu Love, Airoplane Love-

  స్కాట్‌ను ఇంటికి తెచ్చుకోవడం వీలు పడదు.అందుకే స్కాట్‌ రూపంలో ఉండే చిన్న విమానంను చేయించుకుని ఇంట్లో పెట్టుకుని జీవితాంతం ఆ జ్ఞాపకాలతో బతికేస్తానంటోంది.త్వరలో వివాహానికి సిద్దం అవుతున్నట్లుగా చెప్పుకొచ్చింది.బెర్లిన్‌ ప్రేమను చాలా మంది పిచ్చి అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.మరి మీ అభిప్రాయం ఏంటీ?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube