నా జీవితంలో తీవ్రంగా దుఃఖించిన రోజు అదే.. దానికి ఈ 3 మెస్సేజ్ లే సాక్ష్యం.!! రియల్‌ స్టోరీ..!  

A Woman Real Story About 3 Incident At One Day -

జీవితంలో ఎవరికైనా విపరీతమైన దుఃఖం వచ్చిన రోజు ఒకటి కచ్చితంగా ఉంటుంది.అలాంటి రోజున ఎవరైనా తీవ్రంగా బాధపడతారు.

A Woman Real Story About 3 Incident At One Day

కొందరు తమకు ఎదురైన ఘటనలతో అలాంటి రోజున తీవ్రంగా కుంగిపోతారు.అయితే నాకు కూడా అలా తీవ్రంగా ఏడ్చిన రోజు ఒకటి వచ్చింది.

ఆ రోజు నిజంగా నేను ఎంతగా ఏడ్చానో నాకు తెలియదు.ఏకధాటిగా 3 గంటల పాటు దుఃఖిస్తూనే ఉన్నా.అందుకు కింద చెప్పిన 3 అంశాలు కారణమయ్యాయి.

మొదటి అంశం…


ఆ రోజు నా సోదరుడి పుట్టిన రోజు.అతనికి కొంత డబ్బు అవసరం అయింది.దీంతో అతను నన్ను ఆ డబ్బు అడిగాడు.కానీ నేను సీరియస్‌గా తీసుకోలేదు.అతన్ని పట్టించుకోలేదు.

దీంతో కొంత సేపయ్యాక నాకే బాధ అనిపించి డబ్బు అతని అకౌంట్‌లో వేద్దామని అతని అకౌంట్‌ నంబర్‌ చెప్పమని, మెసేజ్‌ పెట్టా.కానీ అతను మాత్రం రిప్లై ఇవ్వలేదు.

దీంతో నాకు తీవ్రమైన విచారం కలిగి దుఃఖం వచ్చింది.

రెండో అంశం…


ఆమె నా బెస్ట్‌ ఫీమేల్‌ ఫ్రెండ్‌.కానీ కొన్ని రోజుల నుంచి నేను ఆమెను పట్టించుకోవడం లేదు.అందుకు పలు కారణాలు ఉన్నాయి.

అయితే ఆ రోజు ఉదయం ఆమె నన్ను ఆమె ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్‌ లిస్ట్‌ నుంచి తొలగించింది.అంతేకాకుండా, ఇతర సోషల్‌ యాప్స్‌లో కూడా నన్ను బ్లాక్‌ చేసింది.

ఎందుకంటే.నేను ఒకసారి ఆమెతో అన్నా.

ఆమె మెసేజ్‌ల వల్ల నా జీవితం పాడవుతుందని చెప్పా.దీంతో హర్ట్‌ అయిన ఆమె నన్ను అన్ని యాప్స్‌లోనూ బ్లాక్‌ చేసింది.

అప్పుడు నాకు బాధ వేసింది.

మూడో అంశం…


అతను నా బెస్ట్‌ మేల్‌ ఫ్రెండ్‌.ఆ రోజు సాయంత్రం అతనితో కలసి ఒక చోట కూర్చుని మాట్లాడుతున్నా.అయితే అతను సడెన్ గా తన ఇంటికి వెళ్లిపోయాడు.

ఎందుకంటే.మేము అలా రోజూ మాట్లాడుకుంటూ ఉండే సరికి అతన్ని ఎవరో మా రిలేషన్‌ షిప్‌ గురించి అడిగారట.

అందుకు అతను ఏమని సమాధానం చెప్పాడో నాకు తెలియదు.కానీ అప్పటి నుంచి అతను నాతో మాట్లాడడం మానేశాడు.

మేమిద్దరం రోజూ చూసుకుంటూనే ఉంటాం.కానీ ఒకరంటే ఒకరికి తెలియనట్లు ప్రస్తుతం ఉంటున్నాం.

పైన చెప్పిన మూడు అంశాలకు చెందిన సంఘటనలు ఒకే రోజు జరిగాయి.ఆ రోజు నేను తీవ్రంగా దుఃఖించా.అలాంటి రోజు ఇక అసలు మళ్లీ రాకూడదనే అనుకుంటున్నా.!

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

A Woman Real Story About 3 Incident At One Day- Related....