విచిత్రం : ఆమె కప్ప కోసం ఎంత చేసిందో తెలిస్తే నమ్మలేక నోరెళ్లబెడతారు

కొందరు మనుషులను చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది.అసలు వారు ఇలా ఎందుకు చేస్తున్నారు అనిపిస్తుంది.

 A Woman Posted Her Pet Frog Photographs Those Are Viral-TeluguStop.com

ప్రపంచంలో ఇలాంటి వారు కూడా ఉంటారా అనే అనుమానం కలుగుతుంది.ఇప్పటి వరకు మనం పెంపుడు జంతువులుగా కుక్కలు పిల్లులను పెంచుకోవడం చూశాం.

కొందరు మాత్రం చాలా ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఇంకొన్ని ఇతర జంతువులను కూడా పెంచుకుంటారు.కాని సవన్నా మైకెల్ల్‌ అనే మహిళ మాత్రం చాలా ప్రత్యేకంగా కప్పను పెంచుకుంటుంది.

విచిత్రం : ఆమె కప్ప కోసం ఎంత చే

కప్పను పెంచుకుంటుంది సరే అని వదిలేయలేం.సాదారణంగా కప్పను ఆమె కాస్త ఆహారం వేసి, ఏదో ఒక మూలకు ఉంచితే మనం ఇంతగా చర్చించుకునే అవసరం లేదు.కాని ఆమె కప్ప కోసం ఏర్పాటు చేసిన వసతులు చర్చనీయాంశం అవుతున్నాయి.తన ఇంట్లోని ఒక రూంలో కప్పకోసం ఏర్పాటు చేసిన గదిని చూస్తే ఆశ్చర్యం వేస్తోంది.

ఆ గదిలో కప్ప కోసం సోఫా సెట్‌తో పాటు చక్కని మ్యూజిక్‌ వచ్చే సిస్టం ఇంకా ఒక చిన్న స్క్రీన్‌ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.

విచిత్రం : ఆమె కప్ప కోసం ఎంత చే

కప్పకు ఇంతగా ఏర్పాట్లు చేయడంను అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు.సోషల్‌ మీడియా ఫేస్‌బుక్‌లో ప్రాగ్‌ స్పట్టింగ్‌ అనే గ్రూప్‌ ఉంది.అందులో దాదాపు 70 వేల మంది మెంబర్స్‌ ఉంటారు.

వారంతా కూడా కప్పలను గురించి విశేషాలను షేర్‌ చేసుకుంటూ ఉంటారు.అందులో మెంబర్‌ అయిన సవన్నా తన ఇంట్లో కప్ప కోసం ఏర్పాటు చేసిన వసతులను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

ఆ కప్పను ఈమె గత కొంత కాలంగా పెంచుకుంటుంది.ఆ కప్పకు నెలకు ఒక సారి హెల్త్‌ చెకప్స్‌ కూడా చేయిస్తూ ఉంది.

మనం కప్పలను చూడటానికే అస్యహించుకుంటాం.అలాంటిది ఈమె ఏకంగా కప్పను పెంచుకోవడంతో పాటు ఇలా చూసుకోవడం ఆశ్చర్యంగా ఉంది కదా.!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube