అంబులెన్స్‌లను ఇళ్లుగా మార్చి లక్షలు సంపాదిస్తున్న మహిళ..

A Woman Making Millions By Turning Ambulances Into Houses

ప్రతిభ ఉండాలేగానీ ఏ విధంగానైనా డబ్బులు సంపాదించవచ్చు.ఈ సత్యాన్ని మరోసారి నిరూపించింది ఇంగ్లండ్ లోని బ్రిస్టల్‌కు చెందిన 39 ఏళ్ల సమంత.

 A Woman Making Millions By Turning Ambulances Into Houses-TeluguStop.com

ఈమె యూరప్ దేశాల వ్యాప్తంగా ఉన్న పాత అంబులెన్స్‌లను కొనుగోలు చేస్తుంది.వాటిని ఇళ్లుగా మార్చి విక్రయిస్తుంది.

సాధారణంగా విదేశాల్లో భారీ సంఖ్యలో అంబులెన్స్‌లు ఉంటాయి.ఆసుపత్రి సిబ్బంది వీటిని ఒక నిర్దిష్ట కాలం వరకు వాడేసి అమ్మేస్తుంటారు.

 A Woman Making Millions By Turning Ambulances Into Houses-అంబులెన్స్‌లను ఇళ్లుగా మార్చి లక్షలు సంపాదిస్తున్న మహిళ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే పాత అంబులెన్స్‌లను చాలా తక్కువ ధరకే కొనుగోలు చేస్తోంది సమంత.తర్వాత వాటిని రీసైకిల్ చేసి మినీ హౌస్‌లా తీర్చిదిద్దుతోంది.

తుప్పు పట్టిన పార్ట్స్ తక్కువ ధరకు అమ్మేసి కొత్తవి కొనుగోలు చేస్తోంది.వాటిని చక్కగా సెట్ చేసి.

ఆకర్షణీయమైన పెయింటింగ్ వేయిస్తోంది.దాంతో పాతబడ్డ అంబులెన్స్ కాస్తా కొత్త ఇంటిలా మెరిసిపోతోంది.

దీన్ని ఎక్కడికైనా డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్ళవచ్చు.ఈ విషయం తెలుసుకున్న చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

తరచుగా టూర్లకు వెళ్లేవారు వీటిని లక్షలు వెచ్చించి కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు.సరదాగా హాలిడే ట్రిప్ వెయ్యాలి అనుకునేవారు కూడా సమంత వద్ద మినీ హౌస్ లను కొనుగోలు చేస్తున్నారు.

దాంతో ఈ మూవింగ్ హౌస్ విక్రయాల ద్వారా సమంత లెక్కపెట్టలేనన్ని డబ్బులు సంపాదిస్తోంది.ఆమె చెప్పిందే ఫైనల్ రేట్ అన్నట్టుగా కొనుగోలుదారులు డబ్బులు ఇవ్వడం గమనార్హం.

వేల్స్, స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి చాలా మంది ప్రజలు ఆమె వద్ద అంబులెన్స్‌లు కొనుగోలు చేస్తున్నారు.

Telugu Ambulance, Lakhs, Latest-Latest News - Telugu

సమంతా చిన్నతనం నుంచి పేదరికంలోనే బతికింది.కానీ తన టాలెంట్ తో డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకుంది.అప్పుడే అంబులెన్స్‌లతో చిన్న ఇళ్లను నిర్మించాలని భావించింది.కానీ ఆమె వద్ద అంతగా డబ్బులు లేకపోవడంతో బ్యాంకులో రూ.30 లక్షలు తీసుకుంది.అనంతరం తన ప్రతిభతో ఇళ్లు నిర్మించి తక్కువ కాలంలోనే బ్యాంకు రుణం మొత్తం తీర్చేసింది.ఆమె తయారు చేసే ఇళ్లను క్యాంపెర్‌వాన్స్ అని కూడా పిలుస్తారు.ఒక్కో క్యాంపెర్‌వాన్స్  ఆమె రూ.16 నుంచి రూ.19 లక్షల వరకు అవుతోంది.దీని లోపల ఉపయోగించిన ఇంటీరియర్ కూడా పాత వస్తువులే కాగా వాటిని కొత్తగా చేసి ఆమె విక్రయిస్తోంది.

అయితే ఒక అంబులెన్స్ ను ఇల్లు గా మార్చడానికి ఏకంగా ఆరు నెలలు పడుతుందట.ఈ పని అంత తేలికేం కాదు అని సమంత చెబుతోంది.2012వ సంవత్సరంలో తొలిసారిగా ఆమె క్యాంపెర్‌వాన్ రూపొందించింది.

#Ambulance #Lakhs

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube