అధిక వడ్డీకి ఆశపడిన మహిళ.. రూ.41.40 లక్షల భారీ మోసం..!

A Woman Hoping For High Interest A Huge Fraud Of Rs. 41.40 Lakhs , Krishnaveni, Hanumanth , Woman , Huge Fraud , Rs. 41.40 Lakhs, Crime

ఓ మహిళకు అధిక వడ్డీ ఆశ చూపించి పలు విడతలుగా రూ.41.40 తీసుకున్న కిలాడీ లేడీ భారీ మోసం చేసింది.బాధిత మహిళ డబ్బులు అడిగితే నువ్వు నాకు డబ్బులు ఇవ్వలేదంటూ బుకాయించింది.

 A Woman Hoping For High Interest A Huge Fraud Of Rs. 41.40 Lakhs , Krishnaveni,-TeluguStop.com

దీంతో బాధిత మహిళ మెదక్ ( Medak )ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.అసలు ఎలా మోసం చేసిందో అనే వివరాలు చూద్దాం.

వివరాల్లోకెళితే.మెదక్ లోని జేఎన్ రోడ్డులో కృష్ణవేణి, హనుమంత్( Krishnaveni, Hanumanth ) దంపతులు నివాసం ఉంటున్నారు.

ఈ దంపతులకు పాపన్నపేట మండలం పొడ్చన్ పల్లి గ్రామంలో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.అందులో రెండు ఎకరాల భూమిని కొంతకాలం క్రితం రూ.60 లక్షలకు అమ్మేశారు.పొడ్చన్ పల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ ద్వారా గజ్వేల్ లో వడ్డీ వ్యాపారం చేసే ఓ మహిళతో కృష్ణవేణికి పరిచయం ఏర్పడింది.

తాను వడ్డీ వ్యాపారం చేస్తున్నానని, అధిక వడ్డీ ఇస్తానని కృష్ణవేణిను నమ్మించింది.ఆ మహిళా మాటలు పూర్తిగా నమ్మిన కృష్ణవేణి తన భర్తకు తెలియకుండా మూడు సంవత్సరాల వ్యవధిలో రూ.32 లక్షలు ఆ మహిళకు ఇచ్చింది.

Telugu Hanumanth, Fraud, Krishnaveni, Latest Telugu, Rs Lakhs-Latest News - Telu

కొన్ని రోజుల తర్వాత సదరు మహిళలు డబ్బులు ఇవ్వాల్సిందిగా కృష్ణవేణి కోరింది. రూ.7.20 లక్షలు ఇస్తే చీటీ ముగుస్తుందని, ఆ డబ్బులు రాగానే మొత్తం డబ్బులు కలిపి ఇచ్చేస్తానని సదరు మహిళ, కృష్ణవేణికి తెలిపింది.కానీ కృష్ణవేణికి అనుమానం వచ్చి అసలు విషయం భర్త హనుమంతుకు చెప్పింది.హనుమంతు ఆ వడ్డీ వ్యాపారం చేసే మహిళతో మాట్లాడి ఫోన్ పే ద్వారా రూ.7.20 లక్షలు ఆమె మహిళకు పంపించాడు.తర్వాత కృష్ణవేణి తమ డబ్బులు ఇవ్వాలని ఆ మహిళను అడిగిన స్పందించలేదు.

Telugu Hanumanth, Fraud, Krishnaveni, Latest Telugu, Rs Lakhs-Latest News - Telu

దీంతో కృష్ణవేణి తన భర్త హనుమంతు, కుమారుడుతో కలిసి గజ్వేల్ లో ఉండే వడ్డీ వ్యాపారి మహిళ ఇంటికి వెళ్ళి ఆ మహిళకు తమ డబ్బు తిరిగి ఇవ్వాలని కోరగా మరో రూ.2.20 లక్షలు ఇస్తే రూ.41.40 లక్షలు అవుతాయని తెలుపుతూ.మొత్తం రూ.57 లక్షలు తిరిగి ఇస్తానని తెలిపింది.పలు నెంబర్ల నుంచి ఫోన్ పే ద్వారా రూ.2.20 లక్షలు పంపించారు.తర్వాత ఆ వడ్డీ వ్యాపారి మహిళ నాకు మీరు ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు అంటూ బుకాయించింది.దీంతో బాధితులు గజ్వేల్ సీఐ కు మే 26న ఫిర్యాదు చేశారు.

సీఐ వ్యాపారిని పోలీస్ స్టేషన్ కు పిలిచి విచారించగా నాకు డబ్బులు ఇవ్వలేదు.ఏవైనా సాక్ష్యాలు ఉంటే కోర్టుకు వెళ్ళమని తెలిపింది.

దీంతో బాధితులు మెదక్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube