రేప్‌ కేసు పెట్టిన మహిళ, నిజం కాదని కేసు కొట్టేసిన కోర్టు... అసలు విషయం ఎలా బయట పడిందో తెలుసా?

ఒక మహిళ తనకు అన్యాయం జరిగింది అంటూ కోర్టును ఆశ్రయించింది అంటే ప్రతి ఒక్కరు కూడా అయ్యో పాపం అంటారు.సాదారణంగా మహిళలు తమకు జరిగిన అన్యాయం బయట చెప్పుకుంటే తమ పరువే పోతుందేమో అనే భయంతో అసలు విషయాలను బయటకు చెప్పకుండా ఉంటారు.

 A Woman Filed Case On Man Court Dismiss The Case-TeluguStop.com

కాని ఢిల్లీకి చెందిన ఒక మహిళ మాత్రం తాను రేప్‌కు గురి అయ్యాను అంటూ పదే పదే చెబుతోంది.ఆమె మాట నిజమే అనుకుని కేసు నమోదు చేసిన పోలీసులకు కోర్టు అక్షింతలు వేసింది.

ఆమె తప్పుడు కేసు పెట్టిందని కోర్టు నిర్ధారించింది.పై కోర్టుకు వెళ్లినా కూడా ఆమెకు అదే తీర్పు దక్కింది.

రేప్‌ కేసు పెట్టిన మహిళ, నిజం �

పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఢిల్లీకి చెందిన ఒక మహిళ ప్రొఫెసర్‌కు కొన్నాళ్ల క్రితం సోషల్‌ మీడియాలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు.ఆ వ్యక్తితో ఆమెకు పరిచయం ఎక్కువ అయ్యింది.ఇద్దరు ఫోన్‌లో మాట్లాడుకోవడం, ఇద్దరు ఒకరి విషయాలను ఒకరు షేర్‌ చేసుకోవడం చేసేవారు.అయితే ఇద్దరి మద్య వ్యవహారం ముదిరి బెడ్‌ రూం వరకు వచ్చింది.కొన్నాళ్లు వీరిద్దరి ఆన్‌ బెడ్‌ వ్యవహారం సాగింది.అయితే ఇంతలో ఏం జరిగిందో ఏమో కాని ఇద్దరి మద్య విభేదాలు తలెత్తాయి.

ఇటీవల ఆమె కోర్టును ఆశ్రయించి తాను రేప్‌కు గురయ్యాను అంటూ ఫిర్యాదులో పేర్కొంది.రేప్‌ జరిగి నాలుగు నెలలు అయిన తర్వాత ఆమె కోర్టును ఆశ్రయించడం అనుమానాలకు తావు ఇచ్చింది.

రేప్‌ కేసు పెట్టిన మహిళ, నిజం �

ఆ వ్యక్తి గురించి వాకబు చేసిన పోలీసులు అతడి కాల్‌ డేటాను పరిశీలించారు.ఆమె రేప్‌ జరిగిందని చెబుతున్న రోజుకు ముందు కొన్ని రోజుల కాల్‌ డేటాలో అతడికి ఆమె దాదాపు 530 సార్లు ఫోన్‌ చేసింది.అత్యాచారం చేసినట్లుగా ఆమె చెబుతున్న రోజున లేదా అంతకు ముందు ఇద్దరి మద్య విబేధాలు ఏవో అయ్యి ఉంటాయి అంటూ పోలీసులు అనుమానిస్తున్నారు.కోర్టు అతడిని నిర్దోషిగా పరిగణించి ఆమెను మందలించి వదిలేయడం జరిగింది.

అయినా కూడా ఆమె ఏమాత్రం వదలకుండా పై కోర్టుకు వెళ్లింది.అక్కడ కూడా ఆమెకు అదే తీర్పు వచ్చింది.

ఆమె చెబుతున్నట్లుగా జరిగి ఉంటే ముందే ఫిర్యాదు చేసి ఉండాలి అంటూ కోర్టు అభిప్రాయపడుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube