ముప్పై ఏళ్లుగా `టీ` తాగి బ‌తికేస్తున్న‌ మహిళ.. అదెలా అంటే?  

a woman drinking tea only in West Bengal! woman, drinking tea, West Bengal, tea, latest news, - Telugu Drinking Tea, Latest News, Tea, West Bengal, Woman

సాధార‌ణంగా ఆహారం తీసుకోకుండా.కొన్ని రోజులు మాత్ర‌మే జీవిస్తారు.

TeluguStop.com - A Woman Drinking Tea Only In West Bengal

ఏవైనా ద్రవ పదార్థాలు తీసుకుంటే కొన్ని నెల‌లు జీవించ‌వ‌చ్చు.కానీ, ఓ మహిళ ఎలాంటి ఆహారం తీసుకోకుండా.

కేవ‌లం టీ తాగి ముప్పై ఏళ్ల నుంచి బ‌తుకుంది.వాస్త‌వానికి టీ ని చాలా మంది ఉద‌యం లేవ‌గానే లేదా సాయంత్రం వేళ‌లో తీసుకుంటారు.

TeluguStop.com - ముప్పై ఏళ్లుగా `టీ` తాగి బ‌తికేస్తున్న‌ మహిళ.. అదెలా అంటే-General-Telugu-Telugu Tollywood Photo Image

కొంద‌రైతే త‌ల‌నొప్పిగా అనిపించినా.ఒత్తిడిగా ఉన్నా టీ తాగుతుంటారు.

కానీ, ఓ మ‌హిళ టీ నే త‌న ఆహారం చేసుకుని ముప్పై ఏళ్లుగా జీవితాన్ని కొన‌సాగిస్తోంది.విన‌డానికి విచిత్రంగా ఉన్నా.

న‌మ్మ‌స‌క్యంగా లేక‌పోయినా.ఇది నిజం.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.ప‌శ్చిమ బెంగాల్‌లోని దక్షిణ దీనాజ్‌పూర్‌ ప్రాంతానికి చెందిన నందరాణి మెహంతో అనే మ‌హిళ నివ‌సిస్తోంది.ఈమె వ‌య‌సు 67 సంవ‌త్స‌రాలు.అయితే నంద‌రాణి మెహంతో కుమారుడు ముప్పై ఏళ్ల కింద‌ట కుటుంబంతో గొడ‌వ పెట్టుకుని వేరే దేశానికి వెళ్లిపోయాడు.

ఇక అప్ప‌టి నుంచి నంద‌రాణి ఆహారం తీసుకోవ‌డం మానేసింది.
ఆహారం బ‌దులుగా రోజుకు దాదాపు ప‌ది క‌ప్పుల టీని మాత్ర‌మే తీసుకునేది.

టీతో పాటు సపోర్ట్ గా ఇంకా ఏమైనా ఆహారం తీసుకుంటారా అంటే లేనే లేదు.బలవంతంగా తినిపించాలని చూసినా ఆమె ఒప్పుకునేది కాదు.

దీంతో టీ నే ఆమె ఆహారంగా మారిపోయింది.ప్ర‌స్తుతం ఆమె ఓ గుడిసెలో ఉంటూనే టిఫిన్ సెంట‌ర్ కూడా న‌డుపుకుంటోంది.

ఇక మ‌రో విష‌యం ఏంటంటే.ముప్పై ఏళ్లుగా టీ తాగుతూ బతుకుతున్నప్పటికీ.

ఆమెకు ఎప్పుడూ ఎటువంటి అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్త‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

అయితే ఆమె తాగే టీ లో పాలు ఎక్కువగా పోసుకుని తీసుకుంటుంద‌ట‌.

అదే ఆమె ఆరోగ్యాన్ని ర‌క్షిస్తుంద‌ని వైద్య నిపుణులు అంటున్నారు.ఎలాగంటే.

ఆమె టీ లో పాలు ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల‌.అందులో ఉండే ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు ఆమె శ‌రీరానికి ల‌భిస్తున్నాయి.

త‌ద్వారా ఆమె ఆరోగ్యంగా ఉండ‌గ‌లుగుతుంద‌ని చెబుతున్నారు.

#Drinking Tea #Woman #West Bengal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

A Woman Drinking Tea Only In West Bengal Related Telugu News,Photos/Pics,Images..