మనం మామూలుగా చాలాసార్లు విని వుంటాం ఆరోగ్యంగా ఉండాలంటే.గోమూత్రం తాగితే ఆరోగ్యంగా ఉంటారని ఎందరో చెప్పడం.
అయితే ఇప్పుడు అమెరికాకు చెందిన ఓ యువతి మాత్రం కుక్క మూత్రం తాగుతోంది.వినటానికి విరక్తి చెందేలా ఉన్న.
ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వైరల్ గా మారింది.అసలు ఎందుకు ఆవిడ ఇలా చేస్తుంది.? అలా చేయడానికి గల కారణాలు ఏమిటి.? ఆవిడ అందుకు ఎలాంటి సమాధానాలు ఇచ్చిందన్న సమాధానాలు వింటే నిజంగా ఆశ్చర్యపోతారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.
అమెరికా దేశానికి చెందిన లీనా అనే యువతి ప్రతిరోజు తన పెంపుడు కుక్క యొక్క మూత్రాన్ని ఓ గ్లాసులో పట్టుకొని దాన్ని డైరెక్ట్ గా తాగేస్తోంది.
అసలు ఎందుకు ఇలాంటి పని చేస్తున్నావ్.? బుర్ర ఏమైనా చెడిపోయిందా.? అని ఆమెను ప్రశ్నిస్తే అందుకు సమాధానంగా ఆవిడ “తాను సరదాకోసం కుక్క మూత్రం తాగడం లేదని ఇది నా బ్యూటీ సీక్రెట్ అని తెలుపుతూ.తాను ప్రతిరోజు తన కుక్క మూత్రం తాగడం ద్వారా నా చర్మం కాంతివంతంగా మెరుస్తుంది” అని తెలియజేసింది.
అంతేకాదండోయ్.తనలాగే మనల్ని ట్రై చేయమని చెప్పేస్తుంది.
అలా చేస్తే తనలాగా అందంగా మారిపోతారు అంటూ చెబుతోంది సదరు మహిళ.
ఆవిడ కేవలం మూత్రం తాగడం మాత్రమే కాదు.ఆ మూత్రంలో ఎలాంటి పోషకాలు లభిస్తాయి అన్న విషయాన్ని కూడా వివరిస్తోంది.కుక్క మూత్రం రోజు తాగడం ద్వారా అందులో ఉండే విటమిన్ ఏ, క్యాల్షియం, విటమిన్ E లాంటివి శరీరానికి లభిస్తాయని చెబుతోంది.
అంతేకాదు అందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలతో సైతం పోరాడుతాయని తెలియజేస్తోంది.అయితే ఈ మూత్రం తాగడం ద్వారా ఇది వరకు తనకు మొహం మీద మొటిమలు ఎక్కువగా ఉండేవని.
ఈ మూత్రం తాగడం ద్వారా నా ముఖం మీద ఉండే మొటిమలు పూర్తిగా మాయమయ్యాయని చెప్పుకొచ్చింది.దీంతో ఆ కుక్క మూత్రం తాగడం తనకు అలవాటుగా మారిపోయిందని అలాగే తన ముఖంలో గ్లో బాగా పెరిగింది అని చెప్పుకొచ్చింది.