భర్త చనిపోయిన విషయం కన్న కూతురుకు, బయటకు చెప్పకుండా ఈమె ఏం చేసిందో తెలుసా?  

A Wife S With Husband-delhi Kamala Market,telugu General News,telugu Wiral News,wife,wife And Husband

మనం గతంలో పలు సార్లు మీడియాలో కొన్ని ఆశ్చర్యకర వార్తలను చూశాం.చనిపోయిన వారిని చనిపోలేదు అనుకుని సొంత వారు అలాగే ఉంచుకోవడం.

A Wife S With Husband-delhi Kamala Market,telugu General News,telugu Wiral News,wife,wife And Husband Telugu Viral News A Wife S With Husband-delhi Kamala Market Telugu General News Wiral Wife And Hus-A Wife Lives With Husband-Delhi Kamala Market Telugu General News Wiral Wife And Husband

చిన్న పిల్లలు చనిపోయినప్పుడు ఒక తల్లి దాదాపు 20 ఏళ్ల పాటు ఆ పిల్లల శరీరాలను భద్రపర్చడం మనం గతంలో వార్తలు విన్నాం.అవన్నీ కూడా ఎక్కడెక్కడో జరిగాయి.కాని ఇటీవల మన దేశంలోనే రాజధాని ఢిల్లీలో ఒక ఆశ్చర్యకర సంఘటన జరిగింది.ఈ విషయంపై ప్రస్తుతం ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా ఆశ్చర్యం వ్యక్తం అవుతుంది.

భర్త చనిపోయిన విషయాన్ని దాచిన ఒక లేడీ గురించి ఈ వార్త.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.

ఢిల్లీకి చెందిన కమలా మార్కెట్‌ ప్రాంతంలో కుమార్‌ జై అనే వ్యక్తి కుటుంబంతో ఉంటాడు.రైల్వే ఎంప్లాయి అయిన కుమార్‌ జై మొన్న సోమవారం గుండె పోటుతో మృతి చెందాడు.

భర్త మరణించిన విషయం తెలిసి కూడా భార్య అయిన మీనా బయటకు చెప్పలేదు.రైల్వే స్కూల్‌ లో టీచర్‌గా చేస్తున్న మీనా ప్రతి రోజు లాగే ఆ విషయాన్ని దాచి స్కూల్‌కు వెళ్లి వచ్చింది.

భర్త ఉన్న రూంలోనే తర్వాత రోజు పడుకుంది.వారి కన్న కూతురుకు కూడా ఈ విషయాన్ని చెప్పలేదు.

నాన్నకు అనారోగ్యంగా ఉంది, ఆయన పడుకుని ఉన్నాడు.ఆయన రూంలోకి వెళ్లి ఇబ్బంది పెట్టవద్దంటూ చెప్పడంతో ఆ పాప రెండు రోజులు ఆ రూంకు వెళ్లలేదు.

అయినా కూడా తండ్రి లేవక పోవడంతో అనుమానం వచ్చి తండ్రి వద్దకు వెళ్లింది.ఎంత పిలిచినా పలకక పోవడంతో పాటు నోట్లోంచి రక్తం రావడంతో వెంటనే అంకుల్‌ అంటూ ఒక వ్యక్తికి ఫోన్‌ చేసింది.

అతడు వెంటనే వచ్చి చూడగా చనిపోయి ఉన్నాడు.పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు వచ్చి డెడ్‌బాడీని తీసుకు వెళ్లారు.

పోలీసులు వచ్చిన సమయంలో మీనా తన భర్తను తీసుకు వెళ్లేందుకు ఒప్పుకోలేదు.చనిపోలేదు అంటూ పదే పదే ఏడ్వ సాగింది.దాంతో ఆమెను సున్నితంగా మందలించి ఒప్పించి పోర్ట్‌ మార్టంకు తీసుకు వెళ్లారు.రెండు రోజుల క్రితమే అతడు చనిపోయినట్లుగా రిపోర్ట్‌లో వెళ్లడయ్యింది.

ఆమె మానసిక స్థితిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తుండగా, కొందరు మాత్రం ఆమెకు కుమార్‌ జై అంటే చచ్చేంత ప్రేమ.అందుకే భర్త చనిపోయిన విషయం బయటకు చెప్పకుండా ఉందని స్థానికులు అంటున్నారు.

.

తాజా వార్తలు