వందేళ్లల్లో ఇలాంటి పెళ్లి ఎప్పుడు చూడలేదు..! వరదల్లోనే ఒక్కటై, సహాయక శిబిరంలోనే పెళ్లి!  

A Wedding In Kerala Relief Camp-

కేరళను వర్షం కుదిపేసింది.గత వారం రోజులుగా వరద ముంచెత్తుతోంది.అనేక ప్రాంతాలు నీటమునిగాయి..

A Wedding In Kerala Relief Camp--A Wedding In Kerala Relief Camp-

ఇప్పటివరకు 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.వందలాది మంది నిరాశ్రయులయ్యారు.ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

వేల సంఖ్యలో వరద బాధితులను కాపాడుతున్నాయి సహాయక టీమ్ లు.గర్భిణీలను క్షేమంగా తరలించి బిడ్డకు పురుడు పోశారు.ప్రాణాలకు తెగించి వరద బాధితులకు సాయం చేస్తూ రియల్ హీరోలనిపించుకుంటున్నారు.

ఈ క్రమంలో ఓ పెళ్లి కూడా జరిగింది.వివరాలలోకి వెళ్తే…వరదల్లో ఇండ్లు నీట మునగడంతో అంజు అనే యువతి కుటుంబంతో కలిసి మూడు రోజులుగా ప్రభుత్వ సహాయ శిబిరంలో ఉంటున్నది.ఆ యువతి కుటుంబం మొదట పెండ్లిని వాయిదా వేయాలనుకున్నా పరిస్థితి ఎప్పుడు కుదుటపడుతుందో తెలియని పరిస్థితిలో శిబిరంలోని ఇతర కుటుంబాలు వివాహ వేడుక నిర్వహణకు ఆ కుటుంబాన్ని ఒప్పించారు.వరుడి కుటుంబం కూడా ఒప్పుకుంది.దీంతో సమీప ఆలయంలో హంగు ఆర్బాటం, విందు వినోదాలు లేకున్నా దైవసాక్షిగా ఆ నవజంట ఒక్కటయ్యారు.

వెచూచిరా పట్టణంలో పెండ్లి జరుగాలి.చట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వరదలతో అక్కడికి చేరుకోలేక ఇరు కుటుంబాలు పెండ్లిని వాయిదా వేశాయి.వేడుకలకు సిద్ధం చేసిన ఇంటిని వరుడు సహాయ శిబిరంగా మార్చేసి బాధితులకు భోజన ఏర్పాట్లు కూడా చేశాడు..

తన ఔదార్యాన్ని చాటుకున్నాడు.వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : https://www.youtube.com/watch?v=VIR61v2YaF4