ఏ మనిషికి అయినా స్నేహం అనేది ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగినా కూడా ప్రాణ స్నేహితులుగా మారేవారు చాలామందే ఉంటారు.
స్నేహానికన్నా లోకాన మిన్న ఏమీ లేదని చెబుతుంటారు.ఇక ప్రాణ స్నేహితుల మధ్య ఎలాంటి వైరుధ్యాలు వచ్చినా సరే చివరకు స్నేహాన్ని మించిన బంధం లేదని ఎప్పటికీ కలిసే ఉంటారు.
ప్రాణ స్నేహితుడికి ఎలాంటి ఆపద వచ్చినా వారంతా ఒక్కటయి పోరాడుతారు.స్నేహితుడికి అండగా నిలుస్తుంటారు.
ఇలా స్నేహానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు.
కాగా ఇప్పటికే మనం స్నేహం గొప్పతనం గురించి ఎన్నో ఘటనలు చూస్తున్నాం, వింటున్నాం.
కాగా స్నేహానికి వయసుతో సంబంధం లేకుండా ప్రతి మనిషి కూడా స్నేహం చేస్తుంటారు.అయితే ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే వీరేనేమో అన్నట్టు కొందరు చిన్నారులకు సంబంధించిన వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
వయసు చిన్నదే అయినా వారు స్నేహానికి ఇచ్చిన విలువ చూస్తుంటే మనసు ముచ్చటేస్తుంది.ఇందులో ఓ చిన్నారికి చెందిన ఇల్లు పూర్తిగా మంటల్లో కాలిపోయింది.ఇదే ఇంట్లో ఆ చిన్నారికి సంబంధించిన బొమ్మలు కూడా బూడిదైపోయాయి.
దీంతో తమ స్నేహితుడికి మళ్లీ బొమ్మలు ఇచ్చి సంతోషంగా ఉంచేందుకు స్కూల్ ఫ్రెండ్స్ అంతా ఏకమవుతారు.ఇక తమ చిన్నారి స్నేహితుడిని సర్ ప్రైజ్ చేసేందుకు క్లాస్ రూములో బొమ్మలు ఉంచుతారు.ఇక అతన్ని తీసుకొచ్చి సర్ ప్రైజ్ ఇచ్చారు.
ఇక అదంతా చూసిన ఆ చిన్నారి చాలా ఎమోషనల్ అయిపోతాడు.ఇక తమ చిన్నారి స్నేహితుడిని అంతా ఆప్యాయంగా హత్తుకుంటారు.
ఇదంతా అక్కడున్న వారు వీడియో తీసి వారి స్నేహం ఎంత గొప్పదో తెలియజేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేయగా నెటిజన్లు ఫుల్ ఫిదా అయిపోతున్నారు.
.