ఫారిన్ బ్రాండుని తలపించిన వెహికల్.. అది మన 'టాటా' వారిదే!

భారతదేశంలో చెప్పుకోదగ్గ కంపెనీలలో ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఒకటి.సౌకర్యవంతమైన ప్యాసింజర్ కార్లను మాత్రమే కాకుండా సైన్యం ఉపయోగించే అధునాతన సాయుధ వాహనాలను కూడా వీరు తయారు చేసిన విషయం మీకు తెలిసినదే.

 A Vehicle That Resembles A Foreign Brand It Belongs To Our 'tata'!, Vehicle, Ta-TeluguStop.com

ఈ ఫొటోలలో కనిపిస్తున్న వాహనం అలాంటి అత్యాధునిక సాయుధ వాహనాలలో ఒకటి.అయితే ఇది చూసి ఏ ఫారిన్ బ్రాండో అని అనుకోవద్దు.

అచ్చం అలా కనిపిస్తున్నా, ఈ వాహనాలు ఫారిన్ బ్రాండ్లకు తీసిపోని విధంగా తయారు చేయడం జరిగింది.దీనిని QRFV (క్విక్ రియాక్షన్ ఫైటింగ్ వెహికల్) అని పిలుస్తారు.

దేశసరిహద్దులో కాపలాగా వున్న సైన్యానికి అధునాతనమైన మరియు సురక్షితమైన వాహనాలు ఎంతో అవసరం.ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని టాటా మోటార్స్ ఈ QRFV విహికల్ ని రూపొందించింది.

పేరుకి తగినట్లుగానే, ఈ వాహనాలు అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించి, శత్రువులతో పోరాడేందుకు సైన్యానికి దన్నుగా సహకరిస్తాయి.ప్రస్తుతం అమెరికా, చైనా, రష్యా వంటి దేశాలు బలమైన సైన్యాలను మరియు ఆయుధాలను కలిగి ఉన్నాయి.

ఈ దేశాలకు ఏమాత్రం తీసిపోకుండా భారత సైన్యం కూడా తన బలాన్ని పెంచుకునేందుకు గట్టిగానే కృషి చేస్తోంది.

Telugu America, China, Qrfv, Russia, Tata, Tata Motors, Ups, Vehicle-Latest News

భారత సైన్యం ఇప్పటికే ప్రపంచ స్థాయి సాంకేతికతతో పోటీ పడుతోంది.తాజాగా, భారత సైన్యం ఉపయోగించే వాహనాలను తయారు చేయడానికి టాటా మోటార్స్ తో భారత సైన్యం ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.ఈ ఒప్పందం ప్రకారం, ఇండియన్ ఆర్మీకి అవసరమైన వాహనాలను టాటా మోటార్స్ తయారు చేసి, భారత సైన్యానికి సరఫరా చేస్తుంది.

ఇందుకోసం టాటా గ్రూప్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్ అనే కంపెనీని ఏర్పాటు చేసి, దాని ద్వారా ఈ స్పెషల్ ఆర్మీ వాహనాలను తయారు చేస్తోంది.సైనిక వాహనాలకు సంబంధించిన అన్ని అంశాలు అత్యంత గోప్యంగా ఉంచబడుతాయి కాబట్టి, మరే ఇతర కంపెనీతోనూ సంబంధం లేకుండా టాటా మోటార్స్ ఒంటరిగానే ఈ పని చేస్తున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube