కాకినాడ జిల్లా ప్రత్తిపాడు: ధర్మవరంలో రెండు తలల గొర్రె జననం.కాకినాడ జిల్లా ధర్మవరం గ్రామంలో ఈ వింత చోటుచేసుకుంది.
రెండు తలలతో జన్మించిన గొర్రె పిల్లను చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం తండోపతండాలుగా వస్తున్నారు.
గ్రామానికి చెందిన రైతు పంపనబోయిన వెంకన్న పెంచుకుంటున్న గొర్రెకు రెండు తలల గొర్రె పిల్ల జన్మించింది.
ప్రస్తుతం గొర్రె పిల్ల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది అంటున్న రైతు వెంకన్న.