తెలంగాణ రాజకీయాలలో ప్రతిపక్షాలు, అధికార పక్షం మధ్య రాజకీయ వైరం రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది.ఇక చిన్నచిన్న పార్టీల నుండి మొదలు కొని పెద్ద పెద్ద పార్టీలు అన్నీ కేసీఆర్, టీఆర్ఎస్ టార్గెట్ గానే విమర్శలు గుప్పిస్తూ ముందుకు వెళ్తున్న విషయం తెలిసిందే.
ఎప్పుడెప్పుడు టీఆర్ఎస్ నేతలు ఏ విషయంలో దొరుకుతారా అని పార్టీల సోషల్ మీడియా విభాగాలు కాచుకు కూస్తున్న పరిస్థితి ఉంది.ఇక దీంతో ఇక టీఆర్ఎస్ పార్టీ పైన ఉన్న పోస్టులే పెద్ద ఎత్తున వైరల్ గా మారుతున్న పరిస్థితి ఉంది.
ఏది ఏమైనా ప్రస్తుతం టెక్నాలజీని పెద్ద ఎత్తున వినియోగించు కుంటున్న పరిస్థితిలలో ప్రతి ఒక్క పార్టీ కూడా చాలా జాగ్రత్తగా మెలగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
అయితే తాజాగా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సోదరుడు స్టేషన్ ఘన్ పూర్ సర్పంచ్ సోదరుడు సురేష్ కుమార్ పేరు దళిత బంధు అర్హుల జాబితాలో ఉండటంతో ఒక్క సారిగా ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా విరుచుక పడ్డ తరుణంలో ఇక సర్పంచ్ సురేష్ కుమార్ విలేఖరుల సమావేశం నిర్వహించి ఒక దళితుడిగా దళిత బంధుకు నేను అర్హుడినని కానీ గొప్ప నాయకుడైన ఎమ్మెల్యే సోదరుడిని కావడంతోనే నాకు మంజూరైన దళితబంధుపై అవాకులు చవాకులు పేలుస్తున్నారని

నా వల్ల ఎమ్మెల్యే అయిన నా అన్న తాటికొండ రాజయ్య కు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉన్నందున నాకు వచ్చిన దళిత బంధు నగదును నేను స్వీకరించడం లేదని ట్విస్ట్ ఇచ్చారు.ఇక ఇప్పుడు ఒక్క సారిగా ఇది రాజకీయంగా పెద్ద ఎత్తున వైరల్ గా మారిన పరిస్థితి ఉంది.మరి ఈ విషయంపై ఎమ్మెల్యే రాజయ్య ఏ విధంగా స్పందిస్తారనేది చూడాల్సి ఉంది.







