ఖమ్మం లోక్‎సభ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో ట్విస్ట్

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్( Congress ) అభ్యర్థి ఎంపిక వ్యవహారంలో ట్విస్ట్ నెలకొంది.

కరీంనగర్ ఎంపీ సీటు రెడ్డి సామాజిక వర్గానికే ఇవ్వాలన్న నిర్ణయం నేపథ్యంలో ఖమ్మంలోనూ సమీకరణాలు మారిపోయాయి.

ఈ క్రమంలోనే ఖమ్మంలో అనూహ్యంగా రాయల నాగేశ్వరరావు ( Rayala Nageswara Rao )పేరు తెరపైకి వచ్చింది.ఆయన గతంలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పోటీ చేశారు.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు( Ponguleti Srinivasa Reddy , Tummala Nageswara Rao ) కాంగ్రెస్ లో చేరడంతో పాలేరు నియోజకవర్గంలో రాయల నాగేశ్వర రావుకు అవకాశం చేజారిపోయింది.కాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులతోనూ రాయలకు సత్సంబంధాలు ఉన్నాయి.

ఇటీవల గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ గానూ రాయలకు అవకాశం వచ్చింది.అయితే స్థానికం, లాయలిస్ట్ నినాదంతో జిల్లా నేతలంతా రాయల పేరును ప్రతిపాదిస్తున్నారని తెలుస్తోంది.

Advertisement

స్థానికేతరుడిని ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేస్తారని వస్తున్న వార్తలతో జిల్లా కాంగ్రెస్ లో కలకలం చెలరేగింది.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు