భార్యా, భ‌ర్త‌ల మ‌ధ్య ప్రేమ‌కు చక్క‌ని నిద‌ర్శ‌నం.. ఈ రియ‌ల్ స్టోరీ..!

మాది చాలా చిన్న కుటుంబం.నేను, మా ఆయ‌న అంతే.

 A True Relationship Between Wife And Husband Touched My Heart-TeluguStop.com

ఇద్ద‌ర‌మే ఉండేవాళ్లం.నాకు రెండు డ్రెస్సులు, అప్పుడ‌ప్పుడు క‌ట్టుకునేందుకు ఒక చీర ఉండేది.

ఆయ‌న‌కు రెండు జ‌త‌ల బ‌ట్ట‌లు, ఒక కుర్తా, పైజామా ఉండేది.పైజామాను ఆయ‌న ప్ర‌తి శుక్ర‌వారం వేసుకునేవారు.

మా ఇంట్లో రెండు ప్లాస్టిక్ ప్లేట్లు, కొద్దిపాటి వంట సామగ్రి ఉండేది.ఇక మేం రోజూ చాప‌పైనే నిద్రిస్తాం.

ఇవే మా ఆస్తి.నా భ‌ర్త బ‌స్ కాంట్రాక్ట‌ర్‌గా ప‌నిచేసేవాడు.

రాత్రి పూట బాగా ఆల‌స్యంగా ఇంటికి వ‌చ్చేవాడు.అప్పుడు ఆయ‌న బాగా అల‌సిపోయే క‌నిపించేవాడు.

దాంతో ఆయ‌న నాతో ఎక్కువ‌గా మాట్లాడ‌లేక‌పోయేవాడు.కానీ నాకు ఆ రోజంతా ఏం జ‌రిగిందో ఆయ‌న‌కు చెబుతూ ఆయ‌న‌తో స‌ర‌దాగా మాట్లాడాల‌ని ఉంటుంది.

కానీ ఆయ‌న విన‌క‌పోవ‌డంతో నాకు నేనే మాట్లాడుకునేదాన్ని.

ఆయ‌న‌కు వారంలో ఒక రోజు సెల‌వు ఉండేది.

ఆ రోజు మాకు కొద్దిగా మాట్లాడుకునేందుకు ప్రైవేట్ టైం దొరికేది.కానీ ఒక్కోసారి మేముండే స్ల‌మ్ ఏరియాలో గొడ‌వలు జ‌రిగేవి.

దీంతో మాకు ఆ కాస్త స‌మ‌యం గ‌డిపేందుకు కూడా దొరికేది కాదు.అలాంటి ప‌రిస్థితుల్లో నేను ప్రెగ్నెంట్ అయ్యా.

ఆ విష‌యం నా భ‌ర్త‌కు చెప్ప‌లేదు.ఎందుకంటే.

మేం చాలా దుర్భ‌ర‌మైన ప‌రిస్థితుల్లో ఉన్నాం.నిత్యం మా ఇద్ద‌రి క‌డుపు నిండ‌డ‌మే గ‌గ‌న‌మ‌వుతోంది.

అలాంటి ప‌రిస్థితుల్లో మా మ‌ధ్య‌కు మ‌రో జీవి వ‌స్తుందంటే.ఆ విష‌యాన్ని ఊహించ‌డానికే చాలా భ‌య‌మేసింది.

అలాంటిది ఆ విష‌యాన్ని నా భ‌ర్త‌కు చెబితే.ఇంకేమైనా ఉందా.

అందుకే నేను ప్రెగ్నెంట్ అయిన విష‌యాన్ని దాచాను.

గ‌ర్బ‌వ‌తిని అయిన విష‌యం నా భ‌ర్త వ‌ద్ద దాచాను కానీ, రోజూ నాకు ప‌నికి వెళ్లే వ‌చ్చే స‌రికి నీర‌సంగా ఉండేది.ఒక రోజు ఇంటికి రాగానే తీవ్రంగా వాంతులు అయ్యాయి.నేను అనారోగ్యం బారిన ప‌డ్డాను.

ఆ రోజు రాత్రి నాకు ఇంకా చాలా ఇబ్బంది ఎదురైంది.రాత్రిపూట పంపు ద‌గ్గ‌ర నీటి కోసం క్యూలైన్‌లో చాలా సేపు నిల‌బ‌డాల్సి వచ్చింది.

త‌రువాత కొన్ని రోజుల‌కు అలాగే పంపు ద‌గ్గ‌ర నుంచి నీటిని తెస్తూ కింద‌ప‌డిపోయా.మా ప‌క్కింట్లో ఉండే ఒకామె నన్ను లేపి ఇంటి వ‌ద్ద‌కు తీసుకొచ్చింది.

ఆ పూటకు ఆమే మా ఇంట్లో కూడా వంట చేసింది.అందుకు నేను ఆమెకు మ‌న‌స్సులోనే కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకున్నా.

ఇక ఆ రోజంతా నేను బాగా ఏడ్చా.నా క‌డుపులో ఉన్న నా బిడ్డకు ఏమైనా అయి ఉంటుందేమోన‌న్న భ‌యం న‌న్ను ఆవ‌హించింది.

ఆ రోజు ఇంటికి వ‌చ్చిన నా భ‌ర్త‌తో నేను మాట్లాడ‌లేదు.కాదు.మాట్లాడ‌డం మానేశా.ఇక ఆయ‌న‌తో మాట్లాడ‌వ‌ద్ద‌ని అనుకున్నా.

నేను త‌న‌తో మాట్లాడ‌డం లేద‌న్న విష‌యాన్ని కూడా ఆయ‌న గ్ర‌హించ‌లేదు.అది న‌న్ను ఇంకా బాధ‌పెట్టింది.

ఒక రోజు రాత్రి నేను పంపు ద‌గ్గ‌ర‌కు వెళ్లలేదు.గాఢంగా నిద్ర‌పోయా.

తెల్లారి మెళ‌కువ వ‌చ్చి చూసే స‌రికి ఇంట్లో 3 బ‌కెట్ల నిండా నీళ్లున్నాయి.మా ప‌క్కింటి ఆమె బ‌కెట్ల‌ను నింపిందని అనుకుంటూ… ఆమెకు మ‌న‌స్సులో థ్యాంక్స్ చెప్పుకున్నా.

ఆ త‌రువాత రోజూ ఆమే రాత్రి పూట బ‌కెట్ల‌లో నీటిని నింపి తీసుకువ‌చ్చేది.నేను కొన్ని రోజులు రాత్రి పూట హాయిగా నిద్రపోయా.

త‌రువాత కొన్ని రోజులకు మా ఇంట్లోకి ఒక బెడ్ వ‌చ్చి చేరింది.నా భ‌ర్త తీసుకున్నాడు.

అలా ఇంట్లో తొలిసారిగా బెడ్‌ను చూసేస‌రికి ఆనందం ఆగ‌లేదు.క‌న్నీళ్లు వ‌చ్చాయి.అయితే త‌రువాతే తెలిసింది.ఓ షాకింగ్ విష‌యం.ఒక రోజు మా ఇరుగు పొరుగు మ‌హిళ‌లు వ‌చ్చి నాతో మాట్లాడారు.నేను అంద‌రితో ఇదివ‌ర‌క‌టిలా మాట్లాడ‌డం లేద‌ని వారు నాకు చెప్పారు.

ఇక వారు నా భ‌ర్త గురించి పొగిడారు.ఆయ‌న నాకు భ‌ర్త‌గా ల‌భించ‌డం నేను చేసుకున్న అదృష్ట‌మ‌న్నారు.

నాకు అర్థం కాలేదు.త‌రువాత నాకు తెలిసింది.

రోజూ రాత్రి పూట పంపు ద‌గ్గర నుంచి నీటిని తెస్తుంది, మా పక్కింటి ఆమె కాదు, నా భ‌ర్తే అని.అది కూడా ఒకేసారి మూడు బ‌కెట్ల‌ను మోస్తున్నాడ‌ని తెలిసింది.అప్పుడు నాకు దుఃఖం ఆగ‌లేదు.నేను నా భ‌ర్త‌తో మాట్లాడ‌డం మానేసిందుకు నాపై నాకే అస‌హ్యం వేసింది.అయితే ఆ రోజు ఎప్ప‌టిలాగే ప‌ని నుంచి ఇంటికి వ‌చ్చిన నా భ‌ర్త‌ను చూసి ఆనందం ఆగ‌లేదు.వెంట‌నే అడిగేశా.

నా లాంటి భార్య‌తో నువ్వు ఎలా కాపురం చేస్తున్నావ‌ని అడిగా.అందుకు ఆయ‌న స‌మాధానం చెప్ప‌లేదు.

న‌వ్వి ఊరుకున్నారు.వెంట‌నే నాతో.

బెడ్‌పై నిద్రించ‌డం క‌ష్ట‌మ‌వుతుంది.కింద పడుకుందామా.

అని అడిగారు.అప్పుడు నాకు న‌వ్వు వచ్చింది.

బిగ్గ‌ర‌గా న‌వ్వేశా.అలా కొన్ని రోజుల పాటు బెడ్‌పై ప‌డుకున్న మేము, ఆ రాత్రికి చాప‌పై నిద్రించాం.

అప్పుడు నాక‌నిపించింది.నిజంగా ఇలాంటి భ‌ర్త దొర‌క‌డం నా అదృష్ట‌మే అని.!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube