వందేళ్లయినా వీడని మిస్టరీ..ట్రైన్ తోపాటు 104 మంది ప్రయాణికులు కూడా అదృశ్యం!

మన ప్రపంచమే ఒక అద్భుతం.అలంటి ప్రపంచంలో కొన్ని మిస్టరీలు అందరికి ఛాలెంజెస్ విసురుతూ ఉంటాయి.

 A Train Of Italy Was Carrying 106 Passengers Had Mysteriously Disappeared No Clu-TeluguStop.com

ఒకటా రెండా మన ప్రపంచమే ఒక మిస్టరీ లాంటిది.కొన్ని మిస్టరీలు ఎప్పటికి ఎన్ని ఏళ్లయినా పరిష్కారం కాకుండానే అలానే మిస్టరీగానే మిగిలి పోతాయి.

ఈ మిస్టరీలు మేధావులకు, మహానుభావులకు కూడా అంచు చిక్కకుండా ఉంటాయి.వాటిని ఛేదిద్దాం అని ఎంత ప్రయత్నించినా లాభం ఉండదు.

కొన్ని సంఘటనలు విన్నప్పుడు అది నిజామా.కాదా అనే సందేహం మనలో కలగడం మామూలే.ఇలాంటి అంతు చిక్కని విషయాలు విన్నప్పుడే మనలో వాటి గురించి తెలుసు కోవాలని మరింత ఉత్సాహం పెరుగుతుంది.ప్రపంచంలో ఉన్న ఎన్నో మిస్టరీల్లో ఇది కూడా ఒకటి.

అసలు ఈ మిస్టరీని మేధావులు కూడా ఛేదించలేక పోయారు.ఇది ఇప్పటి మిస్టరీ కాదు .దాదాపు 100 ఏళ్ల నాటి మిస్టరీ.

1911 లో ఇటలీ లోని జెనట్టీ అనే ట్రైన్ రోమన్ రైల్వే స్టేషన్ నుండి బయలు దేరింది.ఆ ట్రైన్ వెళ్లే ప్రయాణ మార్గంలో లంబర్టీ అనే కొండా ప్రాంతం లో కిలో మీటర్ పొడవైన సొరంగ మార్గం ఉంటుంది.

Telugu Passengers, Trainitaly, Italy, Italy Train, Mystery, Roman Railway, Train

ఈ ట్రైన్ ఆ సొరంగ మార్గంలో ప్రయాణించి ఆ తర్వాత అదృశ్యం అయ్యింది.ఈ సొరంగ మార్గంలో ప్రయాణించే ముందు పొగ రావడంతో ఆ ట్రైన్ లోని ఇద్దరు ప్రయాణికులు కిందకు దూకేశారు.

వాళ్ళు దూకేసిన తర్వాత ఆ ట్రైన్ సొరంగ మార్గంలోకి ప్రవేశించింది.

అయితే ఈ సొంరంగమార్గంలోకి వెళ్లిన ట్రైన్ మళ్ళీ బయటకు రాలేదు.అయితే ఈ ట్రైన్ ప్రమాదం జరిగింది అనడానికి కూడా ఎటువంటి సూచనలు కనిపించలేదట.

ఇక ఈ ట్రైన్ లో ప్రయాణించిన 106 మంది కూడా ఏమయ్యారో ఇప్పటి వరకు తెలియలేదు.

Telugu Passengers, Trainitaly, Italy, Italy Train, Mystery, Roman Railway, Train

ఇటలీ ప్రభుత్వం ఆ ట్రైన్ కోసం, అందులో ప్రయాణించిన 106 మంది ప్రయాణికుల కోసం వెతకడానికి అప్పట్లో చాలా ప్రయత్నాలు చేసిన అవి సఫలం కాలేదు.దీంతో ఈ ఘటన ఒక మిస్టరీగా మిగిలి పోయింది.100 ఏళ్ళు అయినా ఇంత టెక్నాలజీ పెరిగిన కూడా ఇటలీ ప్రభుత్వం ఈ కేసును సాల్వ్ చేయలేక పోయింది.దీంతో ఇది ఒక మిస్టరీగా మిగిలి పోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube