ఆ ఈవెంట్స్ లో భారత్ కు మొత్తం 6 పతకాలు..!

భారత్ క్రీడారంగంలో దూసుకుపోతోంది.ప్రపంచ వ్యాప్తంగా అనేక క్రీడా ఈవెంట్లలో పాల్గొంటూ సత్తా చాటుతోంది.

 A Total Of 6 Medals For India In Those Events, Viral Latest,  Viral News, Social-TeluguStop.com

భారత ఆటగాళ్ల ఆటతీరు బాగుండటం వల్ల ప్రత్యర్థులు అపజయపాలవుతున్నాారు.అథ్లెటిక్స్ లో భారత్ పతకాల వేట సాగించింది.

ఇప్పుడు అదే హవా కొనసాగిస్తోంది.తాజాగా షూటింగ్ చాంపియన్షిప్ లో భారత్ పతకాల పంట పండించింది.

ప్రపంచ జూనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్ ఎంతో అట్టహాసంగా నిర్వహిస్తుండగా అందులో భారత్ షూటర్లు మొత్తం 6 పతకాలు సాధించి అదరగొట్టారు.ఒలింపిక్స్ తర్వాత భారత ఆటగాళ్లు మంచి ఫామ్ లోకి వచ్చారు.

తమదైన ఆటతీరును కనబరుస్తూ పతకాలను సాధిస్తున్నారు.ఆదివారం షూటింగ్ ఛాంపియన్షిప్ కు సంబంధించి 6 ఈవెంట్స్‌ జరిగాయి.

అందులో నాలుగింటిలో భారత్‌కు 4 స్వర్ణ పతకాలు లభించాయి.అలాగే రెండు రజత పతకాలను కూడా సాధించాయి.

మరింత ఉత్సాహంతో ఆటగాళ్లు తమ ప్రతిభను చాటారు.

10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ పురుషుల టీమ్‌ ఫైనల్లో తెలంగాణ షూటర్‌ ధనుష్ శ్రీకాంత్ అద్భత ప్రదర్శన ఇచ్చాడు.

తనతో పాటుగా రాజ్‌ప్రీత్‌ సింగ్, పార్థ్‌ మఖీజాలతో కూడిన భారత జట్టు ప్రత్యర్థులతో తలపడింది.దీంతో 16 – 6 పాయింట్లతో అమెరికా టీమ్ ను భారత జట్టు ఓడించింది.ఈ పోరులో స్వర్ణం సాధించింది.10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ ఫైనల్లో మనూ భాకర్‌–సరబ్‌జిత్‌ (భారత్‌) ద్వయం 16–12 పాయింట్లతో శిఖా – నవీన్‌ (భారత్‌) జోడీపై విజయం సాధించింది.అలాగే 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మహిళల జట్టు ఫైనల్లో కూడా మనూ భాకర్, రిథమ్, శిఖా నర్వాల్‌లతో కూడిన ఇండియా టీమ్ 16 – 12 పాయింట్లతో బెలారస్‌ జట్టును ఓడించి విజయం సాధించింది.దీంతో భారత్ మొత్తం 6 పతకాలు సాధించి విజయకేతనం ఎగురవేసింది.

షూటింగ్ ఛాంపియన్షిప్ క్రీడాకారులను అభిమానులు ప్రశంసిస్తున్నారు.భారత్ కు మరిన్ని పతకాలు తేవాలని ఆశిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube