ఇదేందయ్యా ఇది: ల్యాప్ టాప్ కి అంత్యక్రియలట..!

సాధరణంగా మనం ఎవరన్నా చనిపోతే వాళ్ళ ఆత్మకి శాంతి జరగాలని కోరుకుంటూ ఆ చనిపోయిన వ్యక్తికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించడం చూసే ఉంటాము.అలానే మరి కొంతమంది తాము ఎంతగానో ప్రేమించే తమ పెంపుడు జంతువులు, పక్షులు మరణిస్తే వాటికి కూడా ఘనంగా అంత్యక్రియలు జరిపించిన సంఘటనలు మీరు వినే ఉంటారు.

 A Tik Tok User Organizes Funeral For His Lap Top-TeluguStop.com

అయితే తాజాగా ఒక యువకుడు మాత్రం ఇందుకు భిన్నంగా ఒక ప్రాణం లేని ఎలక్ట్రానిక్ వస్తువుకు అంత్యక్రియలు జరిపించాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.

అసలు వివరాల్లోకి వెళితే…

 A Tik Tok User Organizes Funeral For His Lap Top-ఇదేందయ్యా ఇది: ల్యాప్ టాప్ కి అంత్యక్రియలట..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ ఆధునిక కాలంలో మనిషికి స్మార్ట్ ఫోన్ ఎంత అవసరమో ల్యాప్ టాప్ కూడా అంతే అవసరంగా మారిపోయింది.కొంతమంది ల్యాప్‌ టాప్ ను ఒక వస్తువుగా కాకుండా ఒక ఫ్రెండ్ లాగా భావిస్తున్నారు.

దానికి ఏ చిన్న రిపేర్ వచ్చినాగాని వెంటనే బాగు చేయించుకుని మరి వాడుకుంటున్నారు.అయితే ఓ టిక్‌ టాక్ యూజర్ మాత్రం తాను ఎంతగానో ఇష్టపడే ల్యాప్‌ టాప్ పనిచేయకపోవడంతో దానికి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ వీడియోను టిక్‌ టాక్ సృష్టికర్త జెహ్న్ తన ల్యాప్‌ టాప్‌ కు అంత్యక్రియల ఏర్పాట్లు తన ఇంటిలో చేస్తూ చూపించే వీడియోను పంచుకున్నాడు, అలాగే ఆ వీడియోలో ఉన్న ఒక పెద్దావిడ ఏంటి ల్యాప్ టాప్ చనిపోయిందా అని ఆశ్చర్యంగా అడుగుతుంది.

Telugu Crimes, Funny Comments, Jehn, Laptop, Soaicl Media, Social Media, Tik Tok Invertor, Viral Laptop Funeral, Viral Latest, Viral News-Latest News - Telugu

దానికి అతను అవును చనిపోయింది అందుకే అంత్యక్రియలు చేస్తున్ననని చెప్పాడు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చాలామందిని ఆకర్షిస్తుంది.కొంతమంది అయితే ల్యాప్‌ టాప్ యొక్క ఆత్మకు శాంతి జరగాలని కోరుకుంటున్నారు.

మరికొందరు జెహ్న్ కు తమ సానుభూతిని కూడా తెలియజేశారు.మరి కొంతమంది ఫన్నీ కామెంట్స్ పెడుతూ ఆ వీడియో చూసి తెగ నవ్వుతున్నారు.

ప్రాణం ఉన్న జీవులే కాదు ప్రాణం లేని వస్తువులను సైతం మనిషి ఇష్టంగా చూసుకుంటాడు అనడానికి ఈ వీడియో ఒక ఉదాహరణ.

#Funeral #Tik Tok #Jehn #Comments #Crimes

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు