ఓ మూడేళ్ల పిల్లాడు నోటితో పామును ( Snake ) కొరికి చంపేశాడు అంటే వినడానికే ఆశ్చర్యంగా అనిపిస్తుంది.అసలు ఇది నిజమేనా అనే అనుమానం రావడం సహజం.
అయితే ఇది నిజమే.ఉత్తర ప్రదేశ్ లోని( Uttar Pradesh ) ఓ గ్రామంలో ఇంటిముందు ఆడుకుంటున్న పిల్లాడు తన వైపు వస్తున్న పామును అమాంతం పట్టుకుని కొరికి చంపేయడంతో స్థానికంగా తీవ్ర సంచలనం కలిగింది.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

వివరాల్లోకెళితే.ఉత్తరప్రదేశ్ లోని ఫరూఖాబాద్ జిల్లా కొత్వాలి మహ్మదాబాద్ ప్రాంతంలోని మాద్నాపూర్ గ్రామంలో దినేష్ సింగ్ అనే వ్యక్తి కుటుంబం నివాసం ఉంటుంది.శనివారం సాయంత్రం దినేష్ సింగ్ యొక్క మూడేళ్ల కుమారుడు ఇంటి ముందు ఆడుకుంటున్నాడు.
ఇంతలో అటువైపుగా ఒక పాము వచ్చింది.ఆ మూడేళ్ల పిల్లాడికి పాము అంటే ఏందో తెలియదు.
పాము కరిస్తే చనిపోతామని కూడా తెలియకపోవడంతో ఆ పామును చేతితో పట్టుకొని అమాంతం నోటితో కోరికేశాడు.పాము క్షణాల్లో చనిపోయింది.
కాసేపటికి ఆ పిల్లాడు స్పృహ తప్పి పడిపోయాడు.

ఇంట్లో పని చేస్తున్న ఆ బాలుడి నాయనమ్మ పిల్లాడు ఏం చేస్తున్నాడో అంటూ చూసేందుకు బయటకు వచ్చి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైంది.ఆ పిల్లాడు పడిపోయి ఉండడం, పిల్లాడి నోటికి రక్తం అంటి ఉండడం, ఆ పక్కనే పడి ఉన్న పామును చూసి హడలిపోయింది.ఏం చేయాలో అర్థం కాక పెద్ద పెద్ద కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉండే స్థానికులంతా అక్కడికి వచ్చారు.
వెంటనే అందరూ కలిసి స్థానికంగా ఉండే ఆసుపత్రికి తరలించారు.వైద్యులు అన్ని రకాల పరీక్షలు చేసి ఎటువంటి ప్రమాదం లేదని చెప్పడంతో కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల ఉండే స్థానికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.ఈ విషయం గ్రామమంతా తెలియడంతో తీవ్ర సంచలనం కలిగించింది.
