అక్కడికి వెళ్తే పెళ్లి లేదా ప్రేమ పెటాకులవుతుందట... విచిత్రమైన గుడి గురించి ఆసక్తికర కథనం  

A Temple In Japan To Get Marriage Or Love Divorced-divorce,japan,married Couple,telugu Nri Updates,temple

కొన్ని నమ్మకాలను చూస్తూ ఉంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. విచిత్రంగా ఉందే, అలా జరుగుతుందా అనుకుంటూ సరే ఒక ప్రయత్నం మనమూ చేద్దాం పోయేదేముంది అంటూ అంతా కూడా ఆ విచిత్రమైన పద్దతినే ఫాలో అవ్వడం, మూడ నమ్మకాలను ఫాలో అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు చిల్కూరు బాలాజీ ఆలయంలో మొక్కుకుంటే వీసా వస్తుంది అనేది నమ్మకం..

అక్కడికి వెళ్తే పెళ్లి లేదా ప్రేమ పెటాకులవుతుందట... విచిత్రమైన గుడి గురించి ఆసక్తికర కథనం-A Temple In Japan To Get Marriage Or Love Divorced

అందుకే చిల్కూరు బాలాజీని వీసాల దేవుడు అంటూ అంతా పిలుస్తుంటారు. ఇంకా కొన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తే పిల్లలు పుట్టడం, మరి కొన్ని దేవాలయ్యాల్లో పూజలు చేస్తే జాబ్‌ రావడం జరుగుతుందని అంటారు.

కొన్ని దేవాల్లో పెళ్లి కాని వారు పూజలు చేస్తే వెంటనే, పక్కాగా పెళ్లి అవుతుందని చెబుతూ ఉంటారు.

పెళ్లి కావాల్సిన వారు శని దోషం ఏదైనా ఉంటే వెంటనే వారు ప్రత్యేక మైన కొన్ని దేవాలయాల్లోకి వెళ్లడం వల్ల తప్పకుండా మంచి జరుగుతుంది అనేది మరికొందరి వాదన. ఇలా రకరకాలుగా దేవాలయాలు ఉన్నాయి. అయితే ఆ దేవాలయాల్లో పూజలు చేస్తే మంచి జరుగుతుంది.

కాని జపాన్‌లో ఉన్న ఒక చోటుకు వెళ్లి మొక్కుకుని ముడుపు కడితే ఖచ్చితంగా చెడు జరుగుతుంది. చెడు జరగాలని కోరుకున్న వారు అక్కడికి వెళ్తేరు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… జపాన్‌లోని యాసుయ్‌ కోన్పేగు అనే గుడికి పూర్తిగా చెడు జరగాలని కోరుకునే వారే వెళ్తారు. ఒక జంట తమ వైవాహిక జీవితంకు ఫుల్‌ స్టాప్‌ పెట్టాలని, విడాకులు కావాలని కోరుకున్నప్పుడు ఆ గుడికి వెళ్లి కోరుకుంటే జరిగి పోతుంది.

ప్రేమ బ్రేకప్‌ అయినా, ఉద్యోగం పోవడం అయినా ఏది పెటాకులు అవ్వాలన్నా, ఏ బంధం నాశనం అవ్వాలన్నా, ఏ చెడ్డ పని జరగాలి అన్నా కూడా అక్కడ ఒక చిట్టీపై రాసి పెడితే జరిగిపోతుందని స్థానికులు నమ్ముతున్నారు. రోజుకు పదుల నుండి ఇప్పుడు వందల సంఖ్యలో జనాలు అక్కడికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆ గుడికి గుర్తింపు దక్కింది..

ఇలాంటి గుడి ఇండియాలో ఉండొద్దని కోరుకుందాం. ఎందుకంటే…. ఎందుకో మీకు కూడా తెలుసు.