జనసేన టీడీపీని కలిపే పనిలో ఆ ఎమ్మెల్యే ? 

ఇంకా ఎన్నికలకు రెండున్నర ఏళ్లకు పైగా సమయం ఉన్నా, అప్పుడే సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కసరత్తు మొదలు పెట్టింది.అందుకే గెలుపు తమ ఖాతాలోనే పడే విధంగా ఇప్పటి నుంచే అన్ని పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ వస్తోంది.

 A Tdp Mla In An Attempt To Forge Alliance With Janasena Details, Janasena, Tdp, Pavan Kalyan, Janasenani, Chandrababu, Tdp Janasena Alliance, Cbn, Bjp, Ap Bjp, Somu Veerraju, Tdp Janasena Alliance, Tdp Mla, Pattabhi, Jagan-TeluguStop.com

ఇటీవల టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, దానికి వైసీపీ శ్రేణులు రెచ్చిపోయ టిడిపి కార్యాలయం పై దాడులకు దిగడం వంటి వ్యవహారాలతో టిడిపిలో కాస్త జోరు పెరిగింది.దీంతో 2024లో తప్పకుండా తాము అధికారంలోకి వస్తామని నమ్ముతోంది.

ఆ ధీమా పూర్తి స్థాయిలో ఉండాలి అంటే ఖచ్చితంగా జనసేన పార్టీతో పొత్తు ఉండాలనే దృఢమైన సంకల్పానికి టిడిపి అధినేత చంద్రబాబు వచ్చేసారు.ఇప్పటికే రకరకాల సంకేతాల ద్వారా జనసేనకు దగ్గరయ్యేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తూనే ఉన్నారు.

 A Tdp Mla In An Attempt To Forge Alliance With Janasena Details, Janasena, TDP, Pavan Kalyan, Janasenani, Chandrababu, TDP Janasena Alliance, Cbn, Bjp, Ap Bjp, Somu Veerraju, Tdp Janasena Alliance, Tdp Mla, Pattabhi, Jagan-జనసేన టీడీపీని కలిపే పనిలో ఆ ఎమ్మెల్యే  -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పుడు ఆ ప్రయత్నాలను అత్యంత రహస్యంగా మొదలుపెట్టినట్లు సమాచారం.తెలుగుదేశం పార్టీకి చెందిన పవన్ సామాజికవర్గానికి చెందిన ఓ ఎమ్మెల్యే టిడిపి- జనసేన పొత్తు కుదిర్చే బాధ్యతల్లో నిమగ్నమయ్యారట.

పనిలో పనిగా బిజెపిని కలుపుకుని వెళితే ఏపీలో తప్పకుండా అధికారంలోకి వస్తామని, తమతో పొత్తు పెట్టుకుంటే కోరినన్ని సీట్లు ఇస్తామనే హామీని ఇస్తూ, జనసేన కు దగ్గర ఎందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం.

టీడీపీతో కలిసి వెళ్లేందుకు బిజెపి ఒప్పుకోకపోయినా, జనసేన టిడిపి పొత్తు మాత్రం ఖచ్చితంగా ఉండాలని ,అప్పుడే అధికారం దక్కుతుందనే విషయాన్ని పవన్ కు చెప్పి నచ్చజెప్పే పనుల్లో సదరు టిడిపి ఎమ్మెల్యే నిమగ్నమైనట్లు సమాచారం.

చాలాకాలం నుంచి టిడిపి జనసేన పొత్తుకు సంబంధించి అనేక కథనాలు వస్తున్నా, టిడిపి నుంచి కానీ ,ఇటు జనసేన నుంచి కానీ స్పందన రాకపోవడంతో ఇదంతా నిజమే అనే  అభిప్రాయం రెండు పార్టీల నేతల్లో నెలకొంది.ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి కంటే టీడీపీతో కలిసి వెళ్లడమే మంచిదనే అభిప్రాయం జనసేన వర్గాల్లోనూ ఉంది.

Telugu Ap Bjp, Chandrababu, Jagan, Janasena, Janasenani, Pattabhi, Pavan Kalyan, Somu Veerraju, Tdpjanasena, Tdp Mla-Political

ఎందుకంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రమైంది.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ఏపీకి ప్రత్యేక హోదా ఇలా అనేక అంశాలలో బీజేపీపై ఏపీ ప్రజల్లో ఆగ్రహం ఉంది.

దీనికి తోడు క్షేత్రస్థాయిలో బిజెపికి బలమైన కార్యకర్తలు లేకపోవడం, నాయకత్వ లోపం, ఇలా లెక్కలు వేసుకుని టిడిపి తో కలిసి వెళితే ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయానికి జనసేన కూడా ప్రాధమికంగా వచ్చినట్లు తెలుస్తోంది.ఇప్పటికిప్పుడు బీజేపీతో పొత్తు రద్దు చేసుకోవడం కానీ , టిడిపితో పొత్తు పెట్టుకోవడం కానీ చేయకూడదు అని, ఎన్నికల సమయంలో మాత్రమే దీనిపై నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయం లో పవన్ ఉన్నారట.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube