భూ ఉపరితలం వైపు దూసుకొస్తున్న తోక చుక్క...!

మామూలుగా ఒక తోక చుక్క భూమి వైపు దూసుకు రావడం అనేది చాలా అరుదైన విషయం.రెండు రోజుల్లో హేలీ తోక చుక్క భూమి వైపు వచ్చినట్టు చిన్నపుడు మనము పాఠాల్లో చదువుకున్నాం.

 A Tailwind Looming Toward The Surface Of The Earth, A Tailwind, Earth, Internati-TeluguStop.com

అయితే తాజాగా శాస్త్రవేత్తలు మరో తోక చుక్క భూమి పైకి దూసుకు వస్తుందని తెలుపుతున్నారు.గత వారం రోజుల నుండి ఈ తోక చుక్క బుధ గ్రహం కక్షను దాటుకొని సూర్యుని వైపు ప్రయాణించే మార్గంలో తన దిశను మార్చుకుని భూమివైపు ప్రయాణిస్తుందని శాస్త్రవేత్తలు తేల్చారు.

అయితే ఇది మనకు వచ్చే వారం రోజుల తర్వాత సూర్యోదయం ముందు సూర్యాస్తమయం తర్వాత మాత్రమే మనకు కనబడుతుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.అలాగే ఈ తోకచుక్క ఏకంగా ఐదు కిలోమీటర్ల పొడవు ఉండటంతో దాన్ని మనం డైరెక్ట్ గా నే చూడొచ్చని తెలుపుతున్నారు.

ఇక ఈ విషయాన్ని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ లోని నియో వైజ్ శాటిలైట్ ద్వారా శాస్త్రవేత్తలు గుర్తించినట్లు చెబుతున్నారు.అలాగే 2020 సంవత్సరం మొదలైనప్పటి నుండి ప్రపంచంలో ఏదో ఒక మూలన కొత్త కొత్త వింతలు చూస్తూనే ఉన్నాం.

గత సంవత్సరం చివరలో మొదలైన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని ఏ స్థితికి చేర్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కరోనా వైరస్ దెబ్బకు చాలా దేశాల్లో ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube