ఇదేందయ్యా ఇది.. డెలివరీ బాయ్ గుర్రంపై స్వారీ.. వీడియో చూస్తే!

ఈ రోజుల్లో చాలా మంది ఇంటి వద్దకే అన్ని సరుకులు, వస్తువులు రావాలి అనుకుంటున్నారు.కొందరు తమ బిజీ కారణంగానో, మరికొందరు బద్ధకం కారణంగానో డెలివరీ బాయ్స్ పైనే పూర్తిగా ఆధారపడుతున్నారు.

 A Swiggy Delivery Boy Delivering Food On Horse Details, Delivery Boy, Viral Late-TeluguStop.com

అయితే ఈ జాబు చాలా కష్టమైనదే అయినప్పటికీ డెలివరీ బాయ్స్ ఏ మాత్రం కస్టమర్లకు ఇబ్బంది కలగకుండా సకాలంలో డెలివరీలు చేస్తున్నారు.

ముఖ్యంగా ఫుడ్ డెలివరీ బాయ్స్‌ ఒక్క నిమిషమైనా రెస్ట్ తీసుకోకుండా ఆర్డర్లు డెలివరీ చేస్తున్నారు.అయితే ఇదేం ఫ్రీగా కాదండోయ్.కంపెనీలు ఇలా నిబద్ధతతో, సమయానికి డెలివరీ చేసే వారికి ఆకర్షణీయమైన ఇన్‌సెంటివ్స్ ఇస్తున్నాయి.ఎక్కువ ఆర్డర్స్ వస్తే కంపెనీకి లాభం.సమయానికి ఎక్కువ ఆడవాళ్లు క్లియర్ చేస్తే డెలివరీ బాయ్స్ కి లాభం.

ఇలా పరస్పర లాభాలతో ఇరువురు లాభపడుతున్నారు.

అయితే తాజాగా ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ ఆలస్యం కాకుండా సకాలంలో డెలివరీలు చేయాలని ఏకంగా గుర్రమెక్కాడు.

ముంబై వీధుల్లో గుర్రంపై స్వారీ చేస్తూ ఇతడు ఆశ్చర్యపరిచాడు.గుర్రంపై డెలివరీలు ఇస్తున్న ఇతన్ని చూసి కస్టమర్లు కూడా అవాక్కయ్యారు.
కుండపోత వర్షం కురుస్తున్నా ఇతడు లెక్కచేయకుండా గుర్రంపై దూసుకెళ్తూ డెలివరీలు అందించాడు.

ఈ దృశ్యాలను కారులో ఉన్న ఒక వ్యక్తి వీడియో తీశాడు.అనంతరం సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్తా ఇప్పుడు బీభత్సంగా వైరల్ అవుతోంది.ఇది చూసిన నెటిజన్లు “సూపర్ భయ్యా, నీ డెడికేషన్ కి టేక్ ఏ బో” అని పొగుడుతున్నారు.

ఫైవ్ స్టార్ రేటింగ్ కోసం పాపం డెలివరీ బాయ్స్ కి ఇలాంటి తిప్పలు తప్పవు అని ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు.ఇలాంటి డెలివరీ బాయ్స్ వల్లే వర్షంలో కూడా తినాలి అనుకుంటున్నా ఫుడ్ ఐటమ్స్ తినగలుగుతున్నాం అని ఒక యూజర్ కామెంట్ చేశాడు.

ఈ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube