ఈ మధ్యకాలంలో ఓటిటి ప్లాట్ ఫారమ్స్ లో కంటెంట్ కి సంబంధించి ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో కొందరు కొంతమేర బోల్డ్ గా ఉన్నటువంటి సన్నివేశాలను కూడా ఓటిటి ప్లాట్ ఫారమ్స్ లో విడుదల చేస్తూ బాగానే సొమ్ము చేసుకుంటున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ హీరోయిన్ టబు ప్రధాన పాత్రలో నటించిన “ఎ సూటబుల్ బాయ్” అనే వెబ్ సీరీస్ ని ఇటీవలే చిత్ర యూనిట్ సభ్యులు ప్లాట్ ఫారం అయిన నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేశారు.
అయితే ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను మధ్యప్రదేశ్ లోని మహేశ్వర్ జిల్లాలో ఉన్నటువంటి ఓ ప్రముఖ ఆలయంలో చిత్రీకరించారని నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారులపై పలు చట్టాల కింద ఫిర్యాదు నమోదు చేశామని జిల్లా కలెక్టర్ అనుగ్రహ తెలిపారు.దీంతో భారతదేశంలో పవిత్రంగా పూజించేటువంటి దేవుడి ఆలయంలో ఇలాంటి ముద్దు సన్నివేశాలను చిత్రీకరించినందుకు గాను ప్రజలకి నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారులు క్షమాపణలు చెప్పాలని కొందరు నెటిజన్లు కోరుతున్నారు.
అంతేగాక ఈ మధ్యకాలంలో కొందరు వెబ్ సిరీస్ లకు ఎలాంటి సెన్సార్ నిబంధనలు లేకపోవడంతో ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నారని కాబట్టి ఈ విషయం ఓటిటి ప్లాట్ ఫారం అధికారులు ఓ నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇక ఈ విషయంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు తమకు నెట్ ఫ్లిక్స్ అధికారులు ఆలయంలో ముద్దు సన్నివేశాలను తెరకెక్కించినట్లు ఎలాంటి ఆధారాలు మరియు సమాచారం లేదని చెబుతున్నారు.దీంతో మరోమారు మధ్య ప్రదేశ్ హోమ్ మంత్రి మరియు జిల్లా కలెక్టర్ అనుగ్రహ కలుగజేసుకొని ఈ విషయంపై పునర్విచారణ జరిపించాలని సూచించినట్లు సమాచారం.