అవసరం లేకున్నా డబ్బు కోసం ICU లో చేరుస్తున్న డాక్టర్లు - సర్వే   A Study On ICU Cases Exposes The Commercialism Of Medical Mafia     2016-12-29   03:22:45  IST  Raghu V

ఐసీయూ అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అని మనకు బాగా తెలుసు. అంటే పేషెంటు మీద అత్యధిక శ్రద్ధ పెట్టే అవసరం ఉన్నప్పుడు ఐసియూలో చేర్చాలి అన్నామాట. మనం చూస్తుంటాం, మనకు తెలిసిన వారు చాలామంది ఐసియూలో చికిత్స పొందుతుంటారు. అయితే, ప్రతీ పెషెంటుని నిజాయితీగా, చికిత్స కోసమే ఐసియూలో పెడుతున్నారా లేక డబ్బులు ఎక్కువ వస్తాయి, వేల నుంచి లక్షల నుంచి డబ్బులు దండుకోవడానికి పెడుతున్నారా ?

ఇదే డౌటు కొందరు అమెరికన్ మెడికల్ రిసెర్చర్స్ కి వచ్చింది. వెంటనే 2015-2016 సంవత్సరంలో ఐసియూలో చికిత్స పొందిన ఓ 800 మంది రిపోర్టులు బయటకు తీసారు.

అందులో 20.90 శాతం మందిని ఎలాగో చనిపోతారనే తెలిసినా ఐసియులో ఉంచారట డాక్టర్లు. అలాంటి రోగాలతో బ్రతికే ఛాన్స్ లేకున్నా, డబ్బుల కోసం ఐసియులో పెట్టారన్నమాట. ఇక మరో 8 శాతం మందిని కొన ఊపిరితో ఉండగా ఐసియులో పెట్టారట. ఇది మరీ దారుణం.

మరో 23 శాతం మంది ఐసియులో పెట్టల్సినంత సీరియస్‌ కండీషన్ లో లేకపోయినా, ఇంట్లో వారిని టెన్షన్లో పెట్టి, ఐసియుకి తీసుకెళ్ళారట. మిగిలిన మందిలో కూడా ఐసియుకి వెళ్ళాల్సిన కేసులు తక్కువే ఉన్నాయని పరిశోధకులు చెప్పారు.

చూడండి, మనకు మెడికల్ నాలెడ్జి లేకపోతే డాకర్లు, హాస్పిటల్స్ ఎంత దారుణంగా దోచుకుంటున్నారో! ఏం చేస్తాం .. మన మనషుల ప్రాణలంటే మనకు ప్రాణం, పేషెంటు అంటే వారికో వ్యాపారం. మనదేశంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి.

,