తోటి క్లాస్‌మెట్‌కి లవ్ ప్రపోజ్ చేసిన విద్యార్థి.. వీడియో వైరల్.. నెటిజనులు షాక్..!

ఇంటర్నెట్‌లో ఎన్నో ఫన్నీ, ఆసక్తికరమైన వీడియోలు ప్రత్యక్షమవుతూ మనల్ని బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి.అయితే కొన్ని వీడియోలు చూస్తే మాత్రం నోరెళ్లబెట్టక తప్పదు.

 A Student Proposed Love To A Fellow Classmate The Video Went Viral The Netizens Were Shocked , Kids, Class Mates, Love , Propose, Viral Latest, News Viral, Social Media, Video Viral-TeluguStop.com

ఎందుకంటే అవి మనం ఎక్కడా చూసి, విని ఉండం.ఇలాంటివి చూస్తే ఇది నిజమేనా అని ఆశ్చర్యపోతుంటాం.

తాజాగా అలాంటి వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.ఈ వీడియోలో 15 ఏళ్లు కూడా నిండని ఒక విద్యార్థి తన తోటి క్లాస్‌మెట్‌కి ఒక పువ్వు ఇస్తూ లవ్ ప్రపోజ్ చేశాడు.

 A Student Proposed Love To A Fellow Classmate The Video Went Viral The Netizens Were Shocked , Kids, Class Mates, Love , Propose, Viral Latest, News Viral, Social Media, Video Viral -తోటి క్లాస్‌మెట్‌కి లవ్ ప్రపోజ్ చేసిన విద్యార్థి.. వీడియో వైరల్.. నెటిజనులు షాక్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ రోజుల్లో ఇలాంటి ప్రేమలు ఎక్కువైపోతున్నాయేమో గానీ పదేళ్ల క్రితం మగ విద్యార్థులు అమ్మాయిల వద్దకు వెళ్లాలంటేనే భయపడేవారు.చూపులు చూసుకునేవారు కానీ ప్రేమ దోమ అంటూ స్కూళ్లలో రోమియో లాగా తిరిగేవారు కాదు.

కానీ ఇప్పుడు విద్యార్థులు మారిపోయారు.తక్కువ వయసులోనే ప్రేమించుకుంటూ తల్లిదండ్రులకు షాకులు ఇస్తున్నారు.ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో కూడా చాలామంది నెటిజనులకు షాక్ ఇస్తోంది.“ఈ వయసులో ప్రేమ ఏంటో, అదికూడా చదువుకోవాల్సిన స్కూల్ లో ఇలాంటి చేష్టలు ఏంటో” అని చాలామంది అవాక్కవుతున్నారు.

వైరల్ వీడియోలో ఒక అబ్బాయి తన చేతుల్లో పువ్వులతో ఒక అమ్మాయిని ప్రపోజ్ చేయడానికి వెళ్లడం చూడవచ్చు.మొదట, అతను తన వెనుక ఉన్న పువ్వులను దాచిపెట్టాడు, కానీ అతని స్నేహితుల ప్రపోజ్ చేయ్ అని బలవంతపెట్టడంతో అతను ధైర్యాన్ని కూడగట్టుకుని ఒక మోకాలిపై వంగి ప్రపోజ్ చేశాడు.

సినిమాలో చూపించినట్టు రొమాంటిక్‌గా తన ప్రేమను వ్యక్త పరిచాడు.అయితే ఆ పువ్వులను తీసుకొని అతని ప్రేమను అంగీకరించింది ఆ విద్యార్థిని.దాని తర్వాత వారిద్దరూ సిగ్గుపడ్డారు.ఇంతలో, ఇతర విద్యార్థులు కిటికీలోంచి చూసి ముసిముసి నవ్వులు నవ్వారు.

అంతటితో వీడియో ముగిసింది.ఈ వీడియోపై నెటిజన్లు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube