మనం పందులను చాలా సాదరణంగా చూస్తాం.కానీ ఫారెన్ వాళ్లు ప్రతి ఒక జంతువులను కానీ పంక్షులను కానీ ప్రతి ఏదైనా వాళ్లకు వింతలాగానే అనిపింస్తుంది.
దేని గురించైన ప్రత్యేకతలు చేప్పాలంటే వాళ్ల తరువాతే …2022 జనవరి 4న తల్లిదండ్రులైన ఓనీ, కోస్‌లకు పిల్ల ఆర్డ్ వార్క్ పుట్టినట్లు తెలిపింది.పుట్టిన బేబీ ఆడదా, మగదా అన్నది ఈమధ్యే తెలిసిందని చెప్పింది.ఈ ఆర్డ్ వార్క్ పిల్లకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన జూ అధికారులు… దానికి డోబ్బీ అని పేరు పెట్టినట్లు తెలిపారు.90 ఏళ్లలో తొలిసారి పుట్టిన ఈ జంతువును జూ సిబ్బంది దగ్గరుండి జాగ్రత్తగా పెంచుతున్నారు.దీని ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.ఈ పిల్ల ఆర్డ్‌వార్క్‌కి పుట్టుకతోనే దొప్పల లాంటి చెవులున్నాయి.బొచ్చు లేదు.చర్మం ముడతలుపడినట్లుగా ఉంది.
రోజూ సాయంత్రం వేళ జూ సిబ్బంది దీనికి పరీక్షలు చేస్తున్నారు.ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుంటున్నారు.
అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుంటున్నారు.ప్రతి కొన్ని గంటలకు ఓసారి ఆహారం ఇస్తున్నారు.5 వారాలుగా, పగలూ, రాత్రిళ్లు కూడా ఆహారం ఇస్తూ దానికి బలం వచ్చేలా చేస్తున్నారని జూ అధికారులు తమ వెబ్‌సైట్‌లో తెలిపారు.
హాలీవుడ్ బ్లాక్ బస్టర్ హారీ పోటర్ సినిమాలో ఇలాంటిదే ఓ కేరక్టర్ ఉంటుంది.
దాని పేరు డోబ్బీ.ఇది కూడా అలాగే ఉండటంతో ఆ పేరు దీనికి పెట్టారు.ఇది ఆడ జంతువు అని తెలిపారు.ఇది మా జూలో పుట్టిన తొలి ఆర్డ్‌వార్క్.ఇది చరిత్రాత్మక ఘటన.మేం వేడుకలు జరుపుకోవడానికి ఇది బలమైన కారణం.మేము చాలా సంతోషిస్తున్నాము” అని జూ టీమ్ మేనేజర్ డేవ్ వైట్ తెలిపారు.ఇవి రాత్రివేళ అడవిలో తిరిగే వన్యప్రాణులు.ఆఫ్రికాలోని సహారా ఎడారి ప్రాంతాల్లో కనిపిస్తాయి.
ఐతే అక్కడ వ్యవసాయ కార్యకలాపాలు పెరిగిపోవడంతో ఈ జీవుల మనుగడ కష్టమైపోతోంది.మిగతా జంతువుల లాగే వీటిని కూడా మాంసం కోసం వేటాడుతున్నారు.ప్రస్తుతం యూరప్ దేశాల్లోని జూలలో ఇవి 66 మాత్రమే ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న జూలలో 109 మాత్రమే ఉన్నాయి.ఈ జంతువులు పందిని పోలినట్లు ఉంటాయి కాబట్టి వీటిని ఆర్డ్‌వార్క్ అంటున్నారు.
అంటేభూమి పందిఅని అర్థం.పొడవైన ముక్కు ఉండే ఈ జంతువులు… చీమలు, చెదపురుగుల్ని తింటూ బతుకుతాయి.ఇవి చెదపురుగుల పుట్టలను పగలగొట్టి వాటిని తినగలవు.అంతేకాదు… ఇవి భూమిలో కన్నాలు పెట్టి ఆ బొరియల్లో నిద్రపోగలవు.వీటి సంఖ్యను పెంచేందుకు ఎంతలా ప్రయత్నిస్తున్నా ఫలితం కనిపించట్లేదు.