ఇదేంటబ్బ: బీచ్ లో కనిపించిన వింత జీవి..!

మన ఈ భూ ప్రపంచంలో మనకు తెలియని అద్భుతమైన జీవులు చాలానే ఉన్నాయి.కొన్ని అరుదుగా మాత్రమే కనిపిస్తూ ఉంటాయి.

 A Strange Living Thing Found In The Australia Queensland Beach, Mysterious, Brow-TeluguStop.com

కొన్ని మాత్రం అంతరించుపోతూ ఉంటాయి.అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో మనకు తెలియని జీవుల గురించి కూడా మనకు తెలిసేలాగా వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్నారు.

అవి చూసిన మనకు ఈ భూ ప్రపంచంలో అసలు ఇలాంటి జీవి అనేది ఒకటి ఉంటుందా అనే అనుమానం మనకు కలుగుతుంది కదా.కొన్ని కొన్ని జీవులు చూడడానికి భలే ఆశ్చర్యకరంగా ఉంటాయి.ముఖ్యంగా సముద్రంలో మనుగడ సాధించే జీవులు గురించి అయితే చెప్పనవసరం లేదు.

ఎందుకంటే సముద్రంలో రకరకాల జీవులు నివసిస్తాయి.

వాటిలో మనకు కొన్ని తెలిస్తే మరికొన్ని జీవులను మాత్రం అసలు మనం చూసి ఉండము.నిజం చెప్పాలంటే వాటి పేరు కూడా మనకి సరిగా తెలియదు.

ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక వింత జీవికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.ఆ జీవి పేరు ఏంటో తెలియక అందరు జుట్లు పీక్కొంటున్నారు.

ఇంతకీ ఈ ప్రాణి ఎక్కడ కనిపించిందంటే ఆస్ట్రేలియా, క్వీన్స్‌ల్యాండ్‌ లోని ఓ బీచ్ ఒడ్డుకు గోధుమ రంగులో ఉన్న ఈ ప్రాణి కొట్టుకొచ్చింది.

Telugu Australia, Beach, Bloat Fish, Brown Creature, Seatomato, Latest, Washes-L

ఈ ప్రాణి గురించి శాస్త్రవేత్తలు ఏమంటున్నారో చూద్దామా.యెప్పూన్‌ లోని కెంప్ బీచ్‌లోకి కొట్టుకొచ్చిన ఈ ప్రాణి చూడడానికి సీ టమాటో జెల్లీఫిష్, బ్లోబ్ ఫిష్‌ లా కనిపిస్తోంది.అలాగే సొరచేప పెట్టిన గుడ్ల ముద్దలాగా కూడా కనిపిస్తుంది.

దీని గురించి సముద్ర నిపుణుడు అయిన డాక్టర్ లిసా గెర్షివిన్ మాట్లాడుతూ.దీనిని ‘మేన్ సైనేయా బార్కేరి జెల్లీ ఫిష్’ అని అంటారు అని చెప్పారు.

జెల్లీ ఫిష్ లలో ఇది ఒక అరుదైన జెల్లీ ఫిష్ జాతికి చెందిన జీవి అని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube