త‌న దేశాన్ని ఆదుకోవాలంటున్న స్టార్ క్రికెట‌ర్‌

ప్ర‌పంచంలోనే ఇప్పుడు అత్యంత దుర్భ‌ర ప‌రిస్థితులును ఎదుర్కొంటున్న దేశం ఏదైనా ఉందా అంటే అది ఆఫ్ఘనిస్తాన్ అనే చెప్పాలి.ఇప్ప‌టికే ఆ దేశం నుంచి యూఎస్, నాటో సైనిక దళాలు వెన‌క్కు వ‌చ్చేసినా కూడా ఆ దేశంలో ఇప్ప‌టికీ మార‌ణ హోమం జ‌రుగుతూనే ఉంది.

 A Star Cricketer Who Wants To Support His Country, Rashid Khan, Afghanisthan-TeluguStop.com

ఇక ఈ మార‌ణ హోమంలో భాగంగానే గ‌త నెలలో హెల్మాండ్, కాందహార్, హెరాత్ ప్రావిన్స్ ప్రాంతాల్లో అత్యంత దారుణ‌మైన రీతిలో తాలిబన్లు చేసిన దాడుల్లో వేలాదిమంది ప్ర‌జ‌లు అసువులు బాసారు.

ఇక ఈ దాడులు జ‌రిగిన త‌ర్వాత ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ఏకంగా ఉగ్రదాడులు తీవ్రమయ్యాయనే చెప్పాలి.

ఇప్ప‌టికే ఆఫ్ఘనిస్తాన్ దేశంలోని 400 జిల్లాల‌ను ఉగ్ర‌వాదులు త‌మ వ‌శం చేసుకున్నారు.దీంతో ఆగష్టు 31 లోపు ఆఫ్ఘ‌నిస్తాన్ లో మోహ‌రించిన త‌మ పూర్తి ద‌ళాన్ని అమెరికా తన వెన‌క్కు పిలిపించే ఆలోచ‌న‌లో ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సంద‌ర్భంగా ప్రపం‍చ దేశాల అగ్ర నేతలకు ఆఫ్గ‌నిస్తాన్ స్టార్‌ క్రికెటర్ అయిన రషీద్ ఖాన్ చాలా దీన స్థితిలో రిక్వెస్ట్ చేస్తున్నాడు.

ఎలాగైనా ఉగ్ర వాదుల నుంచి త‌న దేశాన్ని కాపాడాలంటూ కోరుతున్నారు.

ప్ర‌స్తుత ప‌రిస్థితుల నుంచి ప్రపంచ నేతలంతా క‌లిసి ఆఫ్ఘ‌నిస్తాన్‌ను కాపాడాల‌ని, త‌మ దేశంలో మ‌ళ్లీ శాంతిని స్థాపించాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు.ప్ర‌స్త‌తం త‌న దేశంఓ శాంతి భ‌ద్ర‌త‌లు తీవ్ర స్థాయిలో అట్ట‌డుగున ఉన్నాయని కాబ‌ట్టి మ‌ళ్లీ త‌న దేశాన్ని పాత స్థితికి తీసుకురావాలంటూ కోరుతున్నాడు.

ఇప్ప‌టికే త‌న దేశంలో పిల్లలు, మహిళలు చ‌నిపోతున్నార‌ని, చాలామంది త‌మ ఇళ్లు, ఆస్తులు కోల్పోతున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నాడు.ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన పోస్టు వైర‌ల్ అవుతోంది.

మ‌రి ర‌షీద్ ఖాన్ ప్ర‌య‌త్నం ఏ మేర‌కు స‌క్సెస్ అవుతుందో తెలియాలంటే ఇంకొంచెం టైమ్ ప‌డుతుంద‌నే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube