అమెరికాలో ఉడతకు బుబోనిక్ ప్లేగు..?

ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో అల్లాడి పోతున్న విషయం.ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ఏ దేశం కూడా కరోనా వైరస్ ను నివారించలేక పోయింది.

 A Squirrel In Us Tests Positive For Bubonic Plague, Squirrel, America, Coronavir-TeluguStop.com

ఇక అమెరికాలో అయితే ఈ మహమ్మారి వైరస్ మరణమృదంగం మోగిస్తూ బ్రేక్ డాన్స్ చేస్తున్న విషయం తెలిసిందే.అయితే ఇప్పటికీ కరోనా వైరస్ తో అమెరికా మొత్తం అల్లకల్లోలం అవుతుంటే తాజాగా బుబోనిక్ ప్లేగు వ్యాధి అక్కడ మరింత మందిని భయపెడుతుంది.

తాజాగా అమెరికాలో ఓ ఉడతకు బుబోనిక్ ప్లేగు వ్యాధి సోకినట్లు తెలుస్తోంది.కొలరాడో రాష్ట్రానికి చెందిన ఆ ఉడతా పరీక్షలో పాజిటివ్ గా తేలింది.

దీంతో ఉడతకు బుబోనిక్ ప్లేగు వ్యాధి సోకిన రాష్ట్రంలో మొత్తం హెల్త్ వార్నింగ్ జారీ చేసింది అమెరికా ప్రభుత్వం.ఈ ప్లేగు వ్యాధి అనేది బ్యాక్టీరియా ద్వారా సోకే వ్యాధి, ఇది ఎలుకలు ఉడతలు లాంటివి సోకితే వాటి మీద వాలే ఈగలకు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

ఇక ఈ వ్యాధి విషయంలో కాస్త అప్రమత్తంగా లేకపోయినా మనుషులకు కూడా సోకి ఏకంగా ప్రాణాలు తీసే ప్రమాదం కూడా ఉంది.చైనాలో ఇద్దరు అన్నదమ్ములకు ఈ వ్యాధి సోకింది.

అంతేకాకుండా గతంలో మరణ మృదంగం మోగించిన ప్రేగు వ్యాధి మళ్లీ పుట్టుకొచ్చింది అంటూ ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.ఈ వ్యాధి సోకిన వారిలో తీవ్ర స్థాయిలో జ్వరం ఉండడంతో పాటు పూర్తిగా శరీరం మొత్తం వణుకుతో వుండడం తలనొప్పి లక్షణాలు కనిపిస్తాయి…శరవేగంగా అప్రమత్తమై చికిత్స చేసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదమని నిపుణులు సూచిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube