మొక్క చుట్టూ పెన‌వేసుకున్న పాము.. ముంగీస ఏం చేసిందో చూస్తే..

అదేంటో తెలీదు గానీ ఈ సృష్టిలో కొన్ని జాతుల జంతువులు ఒక‌దాన్ని చూస్తేనే మ‌రొక‌టి చంపేంత వైరంతో ఉంటాయి.పుట్టుక‌తోనే ఆ జాతుల్లో అలాంటి ల‌క్ష‌ణాలు ఎలా వ‌స్తాయో తెలీదు గానీ త‌మ‌కు వైరం ఉన్న జాతి జంతువు క‌నిపిస్తే మాత్రం వాటిని చంపేదాకా వ‌దిలిపెట్ట‌వు.

 A Snake Entwined Around A Plant If You Look At What The Mongoose Did , Snake, Mo-TeluguStop.com

అలాంటి వాటిల్లో పిల్లి, ఎలుక‌, పాము, ముంగీస లాంటివి ప్ర‌ధానంగా మ‌న‌కు క‌నిపిస్తాయి.వీటికి సంబంధించిన వీడియోల‌కు మంచి వ్యూస్ కూడా వ‌స్తుంటాయి.

ముఖ్యంగా మ‌న‌కు పాము, ముంగీస‌కు సంబంధించిన వీడియోలు బాగా క‌నిపిస్తుంటాయి క‌దా.

ఇప్పుడు అలాంటి పాపుల‌ర్ వీడియోనే మీ ద‌గ్గ‌ర‌కు తీసుకొచ్చాం.

ముఖ్యంగా పాము, ముంగీస‌లో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన పోరులో ఎక్కువ‌గా ముంగీసనే పై చేయి సాధించింది క‌దా.ఎందుకంటే పామును చూస్తే ముంగీస చంపేదాకా ఊరుకోదు.ఇప్పుడు కూడా దాదాపు 44 సెకన్ల పాటు ఉన్న వీడియో ఒక‌టి మ‌ళ్లీ పాము, ముంగీస యుద్ధాన్ని చూపిస్తోంది.ఈ వీడియోను చూస్తే నిజంగా ఇంత ప‌గ‌తో ఉంటాయా జంతువులు అని అనిపించ‌క మాన‌దేమో.

ఈ వీడియోలో ఓ పాము త‌న‌కు ద‌గ్గ‌ర‌లో ఉన్న చిన్న మొక్క చుట్టూ పెన‌వేసుకుంటుంది.

అయితే పామును ఎక్క‌డి నుంచి చూసిందో ఏమో గానీ ఓ ముంగీస వెంట‌నే దాని ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది.

ఇంకేముంది ఆ పామును కిందకు లాగేందుకు విప‌రీతంగా ప్రయత్నించ‌డం మ‌న‌కు క‌నిపిస్తుంది.కానీ పాము మాత్రం దానికి చిక్క‌కుండా పైనే ఉండేందుకు బాగా ప్ర‌య‌త్నిస్తుంది.ఇక ముంగీస మీద‌కు ఎదురుదాడికి కూడా దిగుతుంది.కానీ ముంగీస ఊరుకుంటుందా పాము మెడను పట్టుకుని ఇష్టం వ‌చ్చిన‌ట్టు కొర‌క‌డంతో చేసేది లేక ఆ పాము ముంగీస మీద ఓడిపోతుంది.

దీన్నంతా కూడా అక్క‌డున్న వారు వీడియో తీయ‌గా బాగా వైర‌ల్ అవుతోంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube