‘పవన్’...అభిమానులకి ‘చిరు హెచ్చరిక’..!  

  • 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రత్యక్ష పోరు చేస్తామని, పొత్తులు ఉండవని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఆదిశగా పార్టీని ఏపీలో ముందుకు తీసుకుని వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ సిద్దమయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రకటన ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ కి ఇప్పటికి మింగుడు పడని అంశమే అయినా పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్సిస్తోంది టీడీపీ. పొత్తు లేకుండా తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ముమ్మాటికి లేవనేది ఆ పార్టీలో ప్రతీ కార్యకర్తకి తెలిసిన విషయమే. ఇదిలాఉంటే

  • A Small Warning For Pawan Kalyan Fans Of Janasena-

    A Small Warning For Pawan Kalyan Fans Of Janasena

  • వైసీపీ మాత్రం ఎవ్వరితో పొత్తు నెరపడానికి సిద్దంగా లేదు కూడాఇలా మూడు పార్టీలు ఎవరి బలాబలాలు వారు ప్రజాక్షేత్రంలో తమ స్థాయికి తగ్గట్టుగా నిరూపించుకోవడానికి సిద్దమయ్యారు. పవన్ కళ్యాణ్ తన చరిష్మాతో పార్టీకి మాంచి ఊపుని తీసుకువచ్చారుకవాతు ద్వారా తానెంటో ప్రత్యర్ధి పార్టీలకి చూపించారు పవన్ కళ్యాణ్. పార్టీలో కీలక నేతలని చేర్చుకుంటూ పార్టీని తనవంతు కృషితో ముందుకు తీసుకువెళ్తున్నారు. అదే సమయంలో టీడీపీ , వైసీపీలకి షాకుల మీద షాకులు ఇస్తున్నారు.అయితే

  • పవన్ కళ్యాణ్ ఒక పక్క ఆరడుగుల బుల్లెట్ లా దూసుకుపోతుంటే మరో పక్క అభిమానులు మాత్రం పవన్ కి షాకుల మీద షాకులు ఇస్తున్నారు బులెట్ లా దూసుకుపోతున్న పవన్ ని పట్టుకుని వెనక్కి లాగేస్తున్నారు. తమ తమ చిల్లల చేష్టల వలన పార్టీ పరువుని గంగలో కలిపేస్తున్నారు. జనసేన లో యువ జనం ఉన్నారు కానీ వారికి తోక కూడా ఉంది పవన్ ఆ తోకల్ని కట్ చేయాలి అంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ కూడా చేస్తున్నారు నెటిజన్లు. ఇంతకీ ఏమయ్యిందనే కదాసరే అసలు విషయంలోకి వెళ్తే

  • A Small Warning For Pawan Kalyan Fans Of Janasena-
  • అభిమాన నాయకుడిపై అభిమానం ఉండాలి కానీ ఆ అభిమానం నాయకుడి పై మచ్చ తెచ్చేలా ఉండకూడదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో అదే జరుగుతోంది. పవన్ మీద వేరే పార్టీల మహిళా నేతలు విమర్సాలకి దిగినప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో స్పందిస్తున్న తీరు ఎంతో దారుణంగా ఉంటోంది . కనీసం చెప్పడానికి కూడా వీలులేని మాటలతో పవన్ అభిమానులు స్పందిస్తున్న తీరు అప్పటికి వారికోపాన్ని తగ్గించవచ్చు కానీ ఆ ప్రభావం పవన్ కళ్యాణ్ పై మాత్రం తీవ్రస్థాయిలో పడుతుందనడంలో సందేహం లేదు. పవన్ మహిళలకి తగిన న్యాయం చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అంటూ ఆకట్టుకుంటుంటే అభిమానులు మాత్రం అమ్మనా బూతులు తిడుతూ జనసేనకి పూర్తి స్థాయిలో డ్యామేజ్ తీసుకువస్తున్నారనేది వాస్తవం. ఇకనైనా పవన్ అభిమానులు ఆచితూచి వ్యవహరిస్తే అది మీ అభిమాన నేతకి ఇబ్బందులు తెచ్చిపెట్టకుండా ఉంటుంది.ఇది అభిమానులకి ఇస్తున్న చిరు హెచ్చరిక.