దోశలు వేస్తున్న బుడ్డోడు .. ఈ వీడియో చూస్తే ఫిదా అవుతారంతే!

చిన్న పిల్లలు చేసే పనులు చాలా క్యూట్‌గా అనిపిస్తాయి.బుడ్డి బుడ్డి చేతులతో ముద్దుముద్దుగా చేసే ఆ పనులను చూసి తల్లిదండ్రులు బాగా మురిసిపోతుంటారు.

 A Small Kid Cooking Dosa Viral Video Dosa , Kid, Playing, Cooking, Viral Latest-TeluguStop.com

ఈ దృశ్యాలను చూస్తే మిగతా వారు కూడా ఫిదా అవుతుంటారు.ఐతే కొందరు తల్లిదండ్రులు అందరితో తన సంతోషాన్ని పంచుకునేందుకు తమ పిల్లల వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటారు.

ఈ వీడియోలను చూసి నెటిజన్లు మంత్రముగ్ధులవుతుంటారు.కాగా తాజాగా మనసులను హత్తుకునే మరో చిన్నపిల్లాడి వీడియో వైరల్ గా మారింది.

దీన్ని చూసిన నెటిజన్లు వావ్, ఇది చాలా క్యూట్‌గా ఉంది” అని కామెంట్ చేస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో.

రోషిక్‌ అనే రెండు ఏళ్ల పిల్లాడు కిచెన్‌ నుంచి బుడిబుడి అడుగులు వేసుకుంటూ రావడం చూడవచ్చు.ఈ బుడ్డోడు చేతిలో అట్లకాడ ఉండగా దానిపై దోశ కూడా ఉంది.

ఆ దోశను తీసుకొచ్చి తన నాన్న ప్లేట్‌లో చాలా చక్కగా చేశాడు.కింద పడకుండా చాలా శ్రద్ధగా ఆ బాలుడు అలా దోశ వేయడం చూసి నెటిజన్లు వావ్ అని అంటున్నారు.

నిజానికి ఆ ప్లేట్ ఒక బల్లపై అతడి కంటే ఎత్తులోనే ఉంది.అయినా కూడా అతడు ఆ ప్లేట్‌లో సరిగ్గా దోశ వేసి తన పనితనాన్ని ప్రదర్శించాడు.

జోషిక్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన ఈ వీడియో షేర్ చేసిన కొంత సమయం లోనే విపరీతంగా వైరల్ అయ్యింది.ఈ వీడియోకి ఇప్పటి వరకు 12 లక్షలకు పైగా లైకులు కోటికి పైగా వ్యూస్ వచ్చాయి.

దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube