షర్మిలకు ఆదిలోనే వరుస అడ్డంకులు...ఇది దేనికి సంకేతం

తెలంగాణలో రాజకీయ వాతావరణం ఇలా మారుతుందని ఎవరూ ఊహించి ఉండరు.బీజేపీ, టీఆర్ఎస్ మధ్య తీవ్ర స్థాయిలో పోటీ నడుస్తున్న పరిస్థితులలో షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తుందని ప్రకటించడంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాలలో కలకలం రేగింది.

 A Series Of Obstacles In The Beginning For Sharmila , This Is A Sign Of Somethi-TeluguStop.com

అయితే ఊహించినట్టుగానే పార్టీ ఏర్పాటుకు షర్మిల ముందుకు రావడం, జిల్లాల వారి నేతలతో వరుస సమావేశాలు నిర్వహించడం, ఏప్రిల్ 9న ఖమ్మంలో బహిరంగ సభను ఏర్పాటు చేసి పార్టీ పేరు, ఇతర విషయాలపై పార్టీ ఏర్పాటు చేయడానికి గల కారణాలను తెలంగాణ ప్రజలకు వివరించే అవకాశం ఉంది.కాని షర్మిలకు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి.

ఏప్రిల్ 9 న నిర్వహించబోయే బహిరంగ సభకు ప్రభుత్వం అనుమతినిచ్చినా కోవిడ్ విజృంభణ దృష్ట్యా సభ నిర్వహణపై షర్మిల పునరాలోచనలో పడింది.అయితే సభ ను క్యాన్సిల్ చేస్తున్నట్లు ఇప్పటివరకు షర్మిల ప్రకటించకపోయినా సభ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది.

అయితే దీనిపై షర్మిల ఇప్పటి వరకు స్పందించకపోయినా రకరకాల ప్రచారాలు కొనసాగుతూనే ఉన్నాయి.అయితే షర్మిల సభ రద్దయితే మరల నిర్వహించే అవకాశాలు లేనట్టేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఎందుకంటే ఏప్రిల్ లో భారీగా కోవిడ్ కేసులు నమోదవుతాయని ప్రచారం నడుస్తున్న సమయంలో ఇప్పుడు కాకపోతే మరల సాధ్యమయ్యే పరిస్థితి లేనట్టే తెలుస్తుంది.షర్మిల నిర్ణయం ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube