మాజీ మంత్రి ఈటెల రాజేందర్, ఆయన కుటుంబ సభ్యులపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి.ఇప్పటికే రాజేందర్ పై భూకబ్జా కేసులు నమోదయ్యాయి.
అలాగే రాజేంద్ర భార్య జమున పేరు పై ఉన్న హెచ్చరీస్ వ్యవహారంలోనూ ఇదే విధంగా అధికారులు స్పందించారు.తాజాగా ఆయన కుమారుడు మిథున్ రెడ్డి పై ఇదే రకమైన ఫిర్యాదు అందడంతో టిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ శర వేగంగా స్పందించారు.
వెంటనే ఈ వ్యవహారాన్ని నిగ్గు తేల్చి తనకు నివేదిక ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించారు.అయితే చిన్న చిన్న కేసుల వ్యవహారం కెసిఆర్ వరకు వెళ్లడం అంటేనే అదో సంచలనం.
కానీ రాజేందర్ కుమారుడు నితిన్ రెడ్డి పై మేడ్చల్ మండలం రావల్ కోల్ గ్రామానికి చెందిన మహేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. కెసిఆర్ వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, అవినీతి నిరోధక శాఖ విజిలెన్స్ దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని కోరడం అన్ని వెంట వెంటనే జరిగిపోయాయి.
కెసిఆర్ సీరియస్ గా ఈ కేసును తీసుకోవడానికి రాజేందర్ తో బద్ద శతృత్వం ఏర్పడడమే కారణంగా కనిపిస్తోంది.రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన దగ్గర నుంచి కేసిఆర్ వర్సెస్ రాజేందర్ అన్నట్లుగా వ్యవహారాలు చోటుచేసుకుంటున్నాయి.
హుజూరాబాద్ నియోజకవర్గం లో ఆయనను అరెస్టు చేసేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది.అలాగే ఆర్థికంగానూ దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తోంది.ఇలా అన్ని వైపుల నుంచి రాజేందర్ ను ఇరుకున పెట్టాలని టిఆర్ఎస్ ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది.అయితే ఈ కేసులో రాజేందర్ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు .ప్రభుత్వం నమోదు చేసిన కేసులు, వేధింపులు అన్నిటినీ సానుభూతిగా మార్చుకుని తనకు అనుకూలంగా ఉండే విధంగా రాజేందర్ వ్యవహరిస్తుండగా కెసిఆర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజేందర్ విషయంలో రాజీపడే లా కనిపించడం లేదు.ఇప్పటికే ఈటెల రాజేందర్ మెదక్ జిల్లా అచ్చంపేట పేటలో భూకబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణల పై సమగ్రంగా ప్రభుత్వం విచారణ చేస్తోంది.

ఇప్పుడు రాజేందర్ కుటుంబ సభ్యులందరి వ్యవహారాలను బయటకు తీస్తూ వస్తుండడంతో, ఏ క్షణాన ఏం జరుగుతుందోననే ఉత్కంఠగా అటు రాజేందర్ వర్గీయులలోను నెలకొంది.త్వరలోనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నాను అని రాజేందర్ ప్రకటించిన నేపథ్యంలో అధికార పార్టీ దూకుడును తట్టుకుంటూ రాజేందర్ తన రాజకీయ ప్రస్థానాన్ని ఏవిధంగా కొనసాగిస్తారో చూడాలి.