ఇంటర్ కెమిస్ట్రీ పరీక్ష రోజు చందు ముద్దుల్లో ముంచెత్తాడు..కానీ చివరికి అలా అవుతుంది అనుకోలేదు.!

నేను ఇప్పుడు ఇంజనీరింగ్ పూర్తీ చేశాను.ఒక సాఫ్ట్ వెర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను.

 A Sad True Love Story-TeluguStop.com

కానీ ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు నా లైఫ్ లో జరిగింది మాత్రం ఎప్పటికి మరిచిపోలేను.అప్పుడు నేను ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్నాను.

ఆ రోజు కెమిస్ట్రీ పరీక్ష ఉంది.అదే చివరి పరీక్ష.

అందరికీ ఆ రోజు ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని మనస్సులో ఉంది కానీ నాకు మాత్రం ఆ రోజు కాలం ఆగిపోతే బాగుండు అనిపించింది.

ఆ రోజు ఉదయం ఎనిమిది గంటలకే పరీక్ష ఉంది.

అయితే నేను అంతకు ముందు రోజు రాత్రి చాలా సేపు మెలకువతో ఉండడం, అలారం పెట్టుకోకపోవడం, ఇంట్లో అమ్మానాన్న కూడా లేపకపోవడంతో కాస్త ఆలస్యంగా లేచాను.ఎగ్జామ్ సెంటర్ కు మా ఊరికి 14 కిలోమీటర్ల దూరం ఉంది.

అయితే అప్పటికే మా ఊరి నుంచి బస్ వెళ్లిపోయింది.నేను బస్టాప్ దగ్గరకు వెళ్లి ఇంటికి వస్తుంటే బైక్ పై వెళ్తున్న చందు కనపడ్డాడు.

నన్ను చూడగానే బైక్ ఆపాడు.

ఇంతకీ చందు ఎవరో చెప్పలేదు కదూ…అతను మా క్లాస్ మెట్…చదువులో టాపర్.“బస్సు మిస్ అయ్యిందా రాగిణి.? బైక్ ఎక్కు…ఎక్సమ్ సెంటర్ దగ్గర డ్రాప్ చేస్తా అన్నాడు చందు” .బస్ మిస్ అయినందుకు అంతకు ముందు చాలా బాధపడ్డా.కానీ చందు బైక్ ఎక్కాక మాత్రం ఫుల్ హ్యాపీగా ఫీలయ్యాను.

ఎందుకంటే చందు అంటే నాకు చాలా ఇష్టం.కానీ నా ప్రేమ విషయం అతనికి విషయం ఎప్పటికి చెప్పలేదు.

రెండు సంవత్సరాల నుండి వన్ సైడ్ లవ్.

చందు అమ్మాయిలతో గౌరవంగా మాట్లాడతాడు.చాలా సైలెంట్ గా ఉంటాడు.ఇవే నన్ను ఆకట్టుకున్నాయి.తనూ నన్ను చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాడు.అతని కళ్లు నన్ను ప్రేమిస్తున్నాడని చెబుతూనే ఉంటాయి.

ఎగ్జామ్ అయిపోయాక నీతో మాట్లాడాలి చందు అని చెప్పాను.ఏం మాట్లాడాలి అని అడిగాడు చందు.ఒక పర్సనల్ విషయం నీతో చెప్పాలి అని అన్నాను.సరే ఎక్జామ్ తర్వాత కలుస్తా అన్నాడు.మా ఫ్రెండ్స్.మేము ఇద్దరం బైక్ పై రావడం చూసి ఏవేవో ఊహించుకున్నారు.

ఇక ఒక అమ్మాయి నేరుగా అడిగింది.ఏంటీ పక్కా ప్లాన్ చేసుకుని బస్ మిస్ చేసుకున్నావు కదా అంది.

అదేమి లేదు ఏదో యాక్సిడెంటల్ గా జరిగింది అని చెప్పాను.త్వరత్వరగా పరీక్ష రాసేశాను.

మొత్తానికి ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి.

నా కళ్లు మాత్రం చందు కోసం ఎదురుచూస్తున్నాయి.

పరీక్ష పూర్తవ్వగానే చందుకళ్లు కూడా నన్నే వెదుకుతాయని నాకు తెలుసు.నేను కన్పిస్తే అతను సంతోషంగా ఫీలవుతాడు.

మరి కన్పించకపోతే ఏం చేస్తాడనిపించింది.చూద్దామని నా ఫ్రెండ్‌ పక్కన దాక్కున్నాను.

చందు నా కోసం చూస్తున్నాడు.అతని చూపులు ఎగ్జామ్ సెంటర్ ప్రాంతం అంతా గాలిస్తున్నాయి.ముఖం చిన్నబోయింది.అప్పుడు నేను కన్పించాను.ఇక తన సంతోషానికి అడ్డు లేకుండా పోయింది.చందుకు తెలుసు ఈ రోజు నేను తనకు ప్రపోజ్‌ చేస్తానని.

అతని హృదయస్పందన నాకు వినిపిస్తున్నట్లుంది.

పరీక్ష బాగా రాశావా అన్నాడు.

బాగా రాశాను అన్నాను.మరి నువ్వు అన్నాను.

నీ గురించే ఆలోచిస్తూ ఏమి రాయలేకపోయా అని జోక్ చేశాడు.ఇక నా ఫ్రెండ్స్ అందరూ వారివారి ప్లాన్‌ ప్రకారం ఒక్కోచోటికి వెళ్లిపోతున్నారు.

నాకు పనుంది నేను రానని చెప్పేశాను.తనూ అలాగే తప్పించుకున్నాడు.

ఇద్దరం ఒక పార్క్ కి వెళ్ళాం.

నువ్వుంటే ఇష్టం.

నీతో జీవితాంతం ఉండాలనుకుంటున్నాను అన్నాను.వెంటనే నన్ను గట్టిగా హత్తుకున్నాడు.

పార్క్ లో ఎవరూ లేరు.ఇద్దరం ముద్దుల్లో మునిగితేలాం.

ఇద్దరం గంటల తరబడి మాట్లాడుకున్నాం.ఎన్నో ఊసులు చెప్పుకున్నాం.

నేను రెండేళ్లుగా తనకు చెప్పాలనుకున్న మాటలన్నీ చెప్పాను.తను కూడా నన్ను ఎంతగా ప్రేమించేవాడో చెప్పాడు.

ఇక నుంచి మనల్ని ఏ శక్తి విడదీయలేదు.ఇద్దరం జీవితాంతం కలిసుందాం అన్నాడు.

తర్వాత నేను బస్సులో ఊరికి వస్తానని చందుతో చెప్పాను.ఒకే అన్నాడు.తను బైక్ పై బయల్దేరాడు.చందు బైక్ ను బస్ ఢీకొనింది.యాక్సిడెంట్ లో చందు చనిపోయాడు.ఆ విషయం తెలియగానే గుండె ఆగిపోయినట్లయ్యింది.

ఇది ఇంటర్ లో ఉన్నప్పుడు జరిగింది.అంటే ఇప్పటికి అయిదు సంవత్సరాలైంది…తనంటే ఇప్పటికీ ఎప్పటికీ అదే ప్రేమ ఉంది.చందు జ్ఞాపకాలు నా గుండెల్లో గూడు కట్టుకుని ఉన్నాయి.ఇంటర్ పరీక్షలు జరిగే ప్రతిసారి నాకు నా చందు గుర్తొస్తాడు.

ఐ లవ్ యూ చందు… ఐ మిస్ యూ చందు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube