నా భ‌ర్త‌నే జైలుకు పంపాను...స‌మాజం న‌న్ను చెడిపోయిన మ‌హిళగా చిత్రీక‌రించింది..కానీ అస‌లు నిజం ఇది.!!

నా జీవిత కాల‌మంతా నేను నోరు మూసుకునే ఉన్నా.అలా ఉంటేనే మంచి మ‌హిళ అని అంద‌రూ అంటారు.

 A Sad Story Of Women-TeluguStop.com

నా త‌ల‌రాత‌కు నేను బానిస‌ను.దానికి త‌ల‌వంచి నా జీవితం మొత్తం నేను అనేక లైంగిక వేధింపుల‌కు గుర‌య్యా.

ఇందుకు న‌న్ను నేను క్ష‌మించుకోలేను.నా ప‌ట్ల నాకే సిగ్గు, అస‌హ్యం వేసింది.

ఈ విష‌యం గురించి నేను ఎవ‌రికీ ఏమీ చెప్ప‌లేను.నాకు 4 సంవ‌త్స‌రాల వ‌య‌స్సున్న‌ప్పుడు అమ్మ సొంత సోద‌రుడు న‌న్ను అస‌భ్యంగా తాకేవాడు.

కానీ అమ్మ‌కు ఇది తెలియ‌దు.అత‌ను న‌న్ను జాగ్రత్త‌గానే చూసుకుంటున్నాడ‌ని భావించేది.

నా తండ్రి సోద‌రుడొక‌డు నాకు 5 సంవ‌త్స‌రాల వ‌య‌స్సున్న‌ప్పుడు నాపై అత్యాచారం చేశాడు.నేను తీవ్ర‌మైన బాధ‌తో ఏడ్చా.

నా బాధ‌ను అక్క‌తో చెప్పా.ఈ విష‌యాన్ని ఎవ‌రికీ చెప్ప‌వ‌ద్ద‌ని, చెబితే న‌న్ను త‌ప్పుగా చూస్తార‌ని అక్క చెప్పింది.

అందుకే నోరు మూసుకోవాల్సి వ‌చ్చింది.

న‌న్ను రోజూ స్కూల్‌కు తీసుకెళ్లే రిక్షా అత‌ను న‌న్ను రిక్షా దింపుతున్న‌ప్పుడు, ఎక్కిస్తున్న‌ప్పుడు అస‌భ్యంగా తాకే వాడు.

దాని గురించి నేను అమ్మ‌కు చెప్పా.కానీ ఆమె రిక్షా అత‌న్ని మార్చేసింది కానీ.

ఆ విష‌యం గురించి ఎవ‌రితో చెప్ప‌వ‌ద్ద‌ని, ఎవ‌రికైనా చెబితే నిన్ను త‌ప్పుగా భావిస్తార‌ని అంది.దాంతో అప్పుడు కూడా మౌనం వ‌హించాల్సి వ‌చ్చింది.

ఆ విష‌యాన్ని క‌నీసం నా తండ్రితో అయినా అమ్మ చెప్ప‌లేదు.స్కూల్‌లో టీచ‌ర్ న‌న్ను చెప్పుకోలేని చోట తాకేవాడు.

కానీ ఆ విష‌యం ఎవ‌రికి చెప్పుకోవాలో నాక‌ప్పుడు అర్థం కాలేదు.అలాంటి ఎన్నో వేధింపుల‌ను నా జీవితంలో భ‌రిస్తూ వ‌చ్చా.

నేనిప్పుడు నా బంధువుల ఎదుట స‌రిగ్గా తిర‌గ‌లేను.నాకు యుక్త వ‌య‌స్సు వ‌చ్చాక మా మామ‌య్య‌, బాబాయిల ఎదుట తిరిగే ప్ర‌యత్నం చేయ‌లేదు.

ఎందుకంటే.నేను తీవ్రంగా భ‌య‌ప‌డిపోయా.

ఎంత‌లా అంటే.ఏ మ‌గాన్ని చూసినా నాకు భ‌య‌మేసేది.

ప్ర‌తి మ‌హిళ‌కు జీవితంలో కొన్ని క‌ల‌లు, కోరిక‌లు, ఆశ‌యాలు ఉంటాయి.త‌న వివాహం, భ‌ర్త ప‌ట్ల ఆశ‌లుంటాయి.నేను అందుకు అతీతం కాదు.కానీ నా క‌ల‌ల‌న్నీ క‌ల్ల‌ల‌య్యాయి.నేన‌నుకున్న‌ట్లు ఏదీ జ‌ర‌గ‌లేదు.పెళ్ల‌యిన రోజే.

ఆ రాత్రే నాకు కాళ‌రాత్రి అయింది.నా భ‌ర్త పీక‌ల‌దాకా తాగి వ‌చ్చి నాపై అత్యాచారం చేశాడు.

కొన్ని రోజుల‌కు ఏకంగా త‌న స్నేహితుడొక‌న్ని తీసుకొచ్చి నాతో వ్య‌భిచారం చేయించాడు.డ‌బ్బు కోసం న‌న్ను త‌న స్నేహితుడి ద‌గ్గ‌ర‌కు పంపాడు.

నేను గ‌ర్భం దాల్చిన‌ప్పుడు దేవున్ని ఒక్క‌టే వేడుకున్నా.నాకు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ కూతురు పుట్ట‌వ‌ద్ద‌ని కోరుకున్నా.ఎందుకంటే ఆడ‌పిల్ల అయితే నేను అనుభ‌వించిన‌ట్లుగానే అనేక అవ‌మానాలు భ‌రించాల్సి వ‌స్తుంది.అత్యాచారాల‌కు గురి కావ‌ల్సి వ‌స్తుంది.

వాటిని నా కూతురు విష‌యంలో నేను స‌హించ‌లేను.అందుకే నాకు కూతురు వ‌ద్ద‌నుకున్నా.

కానీ.తానొక‌టి త‌లిస్తే దైవం ఒక‌టి త‌లిచాడ‌ని.

అక్క‌డా నాకు అన్యాయ‌మే జ‌రిగింది.నేన‌నుకున్న‌ది నెర‌వేర‌లేదు.

నాకు కూతురే పుట్టింది.అది 10 సంవ‌త్సరాల కింద‌టి మాట‌.

నాకు నా జీవితంలో ఎదురైన సంఘ‌ట‌నల ప్ర‌భావం ఏమోగానీ.నా కూతురుకు అలాంటి ఘ‌ట‌న‌లు ఎదురు కాకూడ‌ద‌ని భావించా.త‌ను లేకుండా ఒక్క క్ష‌ణం ఉండలేక‌పోయా.నా క‌ళ్లెదుటే త‌న‌ను పెంచా.ఆమె వెళ్లిన ప్ర‌తి చోటా ఆమె వెనుకే నేను ఉండేదాన్ని.ప్ర‌తి చోట‌కు ఆమెను తీసుకెళ్లేదాన్ని.

కానీ.ఒక రోజు రాత్రి మాత్రం.

నాలో దాచుకున్న ఆవేశాన్ని అణ‌చుకోలేక‌పోయా.ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది.

అది నా కూతురి విష‌యంలో.నా భ‌ర్త ఒక వ్య‌క్తిని నా కూతురి గ‌దిలోకి పంపేందుకు తీసుకొచ్చాడు.

అప్పుడు నేను ఎంత బిగ్గ‌ర‌గా అరిచానో నాకే తెలియ‌దు.పిచ్చి ప‌ట్టిన‌దానిలా, దిక్కులు పిక్క‌టిల్లేలా.

ప్ర‌పంచం బ‌ద్ద‌ల‌య్యేలా అరిచా.నా జీవితం మొత్తం నాలో దాచుకున్న ఆగ్ర‌హం ఆ రోజు క‌ట్ట‌లు తెంచుకుంది.

ఆ స‌మ‌యంలో న‌న్ను నేను అణిచిపెట్టుకోలేక‌పోయా.నాకు కంట్రోల్ త‌ప్పింది.

ప‌క్క‌నే ఉన్న క‌త్తి తీసుకుని నా భ‌ర్త‌ను, అత‌నితో వ‌చ్చిన వ్య‌క్తిని పొడిచేందుకు ప‌రిగెత్తా.వారు పారిపోయారు.

అప్పుడే పోలీసుల‌కు కంప్లెయింట్ ఇచ్చా.వారు నా భ‌ర్త‌ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు.

అప్ప‌టి నుంచి అత‌ను జైల్లోనే ఉన్నాడు.

నాకు వేధింపులు ఎదురైతే ప‌ట్టించుకోని స‌మాజం.

అప్పుడు న‌న్ను చెడిపోయిన మ‌హిళ‌గా చిత్రీక‌రించింది.ఎందుకంటే నేను నా భ‌ర్త‌ను జైలుకు పంపాను క‌దా.

అందుక‌ని స‌మాజం నాపై నింద‌లు వేసింది.అయినా నాకేమీ సిగ్గ‌నిపించ‌లేదు.

పైగా నా ప‌ట్ల వారికి చెడు అభిప్రాయం ఉన్నందుకు నాకు ఒకింత గ‌ర్వంగా అనిపించింది.నాలో అంత‌టి ధైర్యం రావ‌డానికి 32 ఏళ్ల స‌మ‌యం ప‌ట్టింది.

ఆ స‌మయానికి అంద‌రి దృష్టిలో చెడ్డ మ‌హిళ‌గా నాపై ముద్ర ప‌డింది.అయినా నాకు బాధ‌లేదు.

నేనిప్పుడు నాకొచ్చే స‌మ‌స్య‌ల‌ను ధైర్యంగా ఎదుర్కొన‌గ‌ల‌ననే న‌మ్మ‌కం నాకు వ‌చ్చింది.!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube