వావ్.. అంతరిక్షంలో సినిమా షూటింగ్.. తొలిసారి ఇలా!

అంతరిక్షం అంటేనే అదొక కొత్త లోకంగా భావిస్తాము.ఇక అక్కడ షూటింగ్ అంటే ఎలా ఫీల్ అవుతాం.

 A Russian Crew Is Shooting The First Feature Film On The Iss, The Challenge Holl-TeluguStop.com

అసలు ఇది నిజమని ఎవ్వరు అనుకోరు.కానీ ఇప్పుడు మొదటి సారి అంతరిక్షంలో కూడా షూటింగ్ చేయడానికి రెడీ అయి పోయారు.

ఇప్పటి వరకు మనం ఎన్నో సినిమాల్లో అంతరిక్షం కు సంబంధించిన అనేక సన్నివేశాలను చూసే ఉంటాం.

అయితే మనకు ఇప్పటి వరకు చుసిన సన్నివేశాలను గ్రాఫిక్స్ లేదా సెట్స్ వేసి తీశారు.

కానీ నిజమైన అంతరిక్షంలో సినిమా షూటింగ్ చేయడం అనేది ఇంత వరకు జరగలేదు.అంతరిక్షంలో షూటింగ్ జరపడం కూడా అసాధ్యం అనుకుని ఇప్పటి వరకు ఎవ్వరు అంతరిక్షంలో షూటింగ్ చేయాలని అనుకోలేదు.

కానీ ఫర్ ది ఫస్ట్ టైం అంతరిక్షంలో కూడా షూటింగ్ జరపడానికి రెడీ అయి పోయారు.

ఇంతకీ అంత సాహసం చేసి అంతరిక్షంలో షూటింగ్ ఎవరు చేయాలని ఎవరు అనుకుంటున్నారా అని ఆలోచిస్తున్నారా.

.రష్యా దేశానికీ చెందిన వారు అంతరిక్షంలో షూటింగ్ చేసేందుకు రెడీ అయ్యారు.

ఈ రోజు రష్యాకు చెందిన అంతరిక్ష నౌక గగనతలంలోకి దూసుకు వెళ్ళింది. ది ఛాలెంజ్ అనే సినిమా షూట్ కోసం డైరెక్టర్ క్లిమ్ షిపెంకో హీరోయిన్ యూలియా పేరెసిల్డ్ ఇంకా ఇతర యూనిట్ సభ్యులు అంతరిక్షం లోకి వెళ్లారు.

Telugu Hollywood, Russia, Space-Movie

చిత్ర యూనిట్ సభ్యులు షూటింగ్ కోసం 12 రోజుల పాటు అంతరిక్షం లోని ఉండ బోతున్నారు.వ్యోమగాములు ఇంకా చిత్ర యూనిట్ సభ్యులు అంతా కలిసి అక్కడ షూట్ లో పాల్గొన బోతున్నారు.ఈ సినిమాలో వ్యోమగామి అంతరిక్షంలో అనారోగ్య పాలవ్వడంతో అతడికి చికిత్స చేయడం కోసం డాక్టర్ అక్కడకి వెళ్తుంది.ఈ సన్నివేశాలను అంతరిక్షంలో దర్శకుడు తెరకెక్కించ బోతున్నాడు.

Telugu Hollywood, Russia, Space-Movie

హీరోయిన్ యూలియా ఈ పాత్ర కోసం స్పేస్ సెంటర్ లో ట్రైనింగ్ తీసుకుంది.ఈ సినిమా షూట్ కోసం అమెరికాకు చెందిన ఒక యూనిట్ సభ్యులు ముందుగానే స్పేస్ సెంటర్ లో షూట్ చేసేందుకు సిద్ధం అయ్యారు.అంతరిక్షంలో షూటింగ్ చేస్తున్న మొదటి దేశంగా రష్యా రికార్డ్ క్రియేట్ చేసింది.అంతరిక్షంలో షూటింగ్ చేయబోతుండడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube