మైక్ పట్టుకొని వీధుల్లో తిరుగుతున్న రోబో కుక్క.. వీడియో చూస్తే షాకే!

ప్రపంచవ్యాప్తంగా రకరకాల రోబోలు ఎన్నో పనులు చేస్తున్నాయి.అయితే తాజాగా ఒక రోబో వీధుల్లో తిరుగుతూ చైనా ప్రజల గుండెల్లో గుబులు రేపుతోంది.

 A Robot Dog Wandering The Streets Holding A Mic Robo Dog,viral Latest, Viral New-TeluguStop.com

ఇది మైక్ పట్టుకొని రోడ్లపై పరిగెడుతూ కరోనా సంబంధిత ఆంక్షలు, సూచనలు చేస్తోంది.వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం చైనా దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.ముఖ్యంగా చైనా ఫైనాన్షియల్ క్యాపిటల్ షాంఘైలో కరోనా విలయతాండవం చేస్తోంది.2.6 కోట్ల జనాభా ఉన్న ఈ సిటీలో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు అధికారులు చాలా కఠిన రూల్స్ తీసుకొచ్చారు.అక్కడి చైనీస్ అధికారులు జనాలను హోం అరెస్ట్ చేసినట్లు వారిని ఇంటి బయట అడుగుపెట్టనివ్వడం లేదు.

చాలా కఠినమైన లాక్‌డౌన్‌ను ఇంప్లీమెంట్ చేస్తున్న షాంఘై రోడ్లపై ఇప్పుడు ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు.రోడ్లపైనే కాదు ప్రజలు తమ ఇంటి ఆవరణలో కూడా తిరగడానికి వీల్లేదని హెల్త్ మినిస్ట్రీ హెచ్చరికలు జారీ చేసింది.

అయితే ఇంటి ముందుకు వచ్చేవారిని కూడా శిక్షిస్తామని ఒక మైక్ లో ఓ రోబో డాగ్ ద్వారా చెప్పిస్తున్నారు అధికారులు.అలాగే దీని సాయంతో కరోనా సంబంధిత సూచనలను తెలియజేస్తున్నారు.

కాగా ఈ రోబో డాగ్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోని ఒక అధికారి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.“వామ్మో, ఒక్కరిని కూడా బయట తిరగనివ్వడం లేదుగా.పైగా రోబో డాగ్ తో పెట్రోలింగ్ చేస్తున్నారు.చైనా వాళ్లు మామూలోళ్లు కాదు” అని కామెంట్స్ చేస్తున్నారు.మరికొందరు మాత్రం చైనా వాళ్లు వాడే టెక్నాలజీ ఇలాగే అద్భుతంగా ఉంటుందని కామెంట్స్ పెడుతున్నారు.ఈ వీడియోకి ఇప్పటికే 17 లక్షల వ్యూస్ వచ్చాయి.

దీనిపై మీరు కూడా ఒక లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube