జపాన్ లో ఊపందుకుంటున్న కూటూ ఉద్యమం  

A Revolt Against High Heels In Japan -

భారత్ లో మీటూ ఉద్యమం ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఈ మీటూ ఉద్యమం ద్వారా మహిళలు తమపై జరిగిన లైంగిక దాడుల గురించి బాహాటంగా మాట్లాడారు.

A Revolt Against High Heels In Japan

అయితే ఇలాంటి ఉద్యమమే జపాన్ లో విస్తరిస్తోందో.అదే కూటూ.‘కూట్స్’ అంటే జపనీస్ భాష లో బూట్లు అని అర్ధం.అయితే అక్కడి మహిళా ఉద్యోగినులు సూట్,హైహీల్స్ తప్పనిసరిగా వేసుకోవాలని జపాన్ ప్రభుత్వం ఆదేశించింది.

దీనితో ఈ తప్పనిసరి విధానాన్ని చాలా మంది మహిళలు వ్యతిరేకిస్తూ ఈ కూటూ ఉద్యమాన్ని చేపట్టారు.హైహీల్స్ వేసుకోవడం వల్ల కాళ్లలో రక్త సరఫరా సరిగా జరగట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోపక్క జపాన్ ఆరోగ్య, కార్మిక సంక్షేమశాఖ మంత్రి టకుమీ నెమోటో మాత్రం మహిళల్నే తప్పుపట్టారు.

పని ప్రదేశాలకు తగినట్టు మహిళలు హై హీల్స్ వేసుకోవడం అవసరమని, అందులో ఏమాత్రం తప్పులేదంటూ ఆమె వ్యాఖ్యలు చేయడం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతుంది.దీనితో ఈ ఉద్యమం మరింత ఊపందుకుంది.హై హీల్స్ వేసుకోవాలని సంస్థల యాజమాన్యాలు తమను ఒత్తిడి చేయకుండా చట్టం తీసుకురావాలంటూ ఉద్యమకారులు ఈ మధ్య కార్మికశాఖను ఆశ్రయించారు.19 వేల మందికి పైగా ఉద్యోగినులు తమ పిటిషన్‌పై సంతకాలు చేశారు.కానీ కార్మిక శాఖ నుంచీ మహిళలకు ఎలాంటి హామీ లభించలేదు.

తాజా వార్తలు

A Revolt Against High Heels In Japan- Related....