92 ఏళ్ల వయసులో అదరగొట్టే రికార్డు.!

వయసు పై బడిపోతున్న కానీ ఇంట్లో ఒక మూల కూర్చుకుండా అద్భుతాలు సృష్టిస్తున్నాడు ఈ 92 ఏళ్ల రిటైర్డ్​ బ్యాంక్ ఉద్యోగి.తొమ్మిది పదుల వయసులో కూడా ఎంతో చలాకిగా ఉంటూ క్రీడల్లో పాల్గొంటూ పతకాలు సాధిస్తున్నారు.92 ఏళ్ల వయసులో కూడా క్రీడల్లో పాల్గొని రెండు పతకాలు సాధించాడు.ఈ కాలంలో యువత కొద్దిగా కష్టపడితేనే డీలా పడిపోతోంది.

 A Record 92 Years Old 92 Years, Latest News,new Record, Viral Latest, Haresh Des-TeluguStop.com

ఎంతసేపు కుర్చీల్లో కూర్చుని కంప్యూటర్ల ముందు అతుక్కుని పోతున్నారు.రాను రాను యువత శారీరక శ్రమకు దూరం అయిపోతున్నారు.

అలాంటిది ఒక పెద్దాయన తన 92ఏళ్ల వయసులో కూడా తన వయసును లెక్కచేయకుండా క్రీడల్లో పాల్గొంటూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.పరుగు పందెంతో పాటు వివిధ క్రీడల్లో పాల్గొంటూ అందరిలోను స్ఫూర్తి నింపుతున్నారు.

ఇంతకీ ఆ పెద్దాయన ఎవరంటే గుజరాత్​ లోని సూరత్​కు చెందిన హరేష్​ దేశాయ్​.ఆయన ఒక బ్యాంక్​ ఆఫీసర్​ గా పని చేసి రిటైర్​ అయ్యారు.కాగా హరేష్​ కు మొదటినుంచి క్రీడలంటే ఎంతో ఇష్టం.ఆ ఇష్టంతోనే ఈ వయసులో కూడా సీనియర్​ సిటీజన్ల కోసం నిర్వహించే పోటీల్లో పాల్గొనడం మొదలుపెట్టారు.అలాగే 2010లో మలేసియాలో జరిగిన ఆసియాన్​ మాస్టర్స్​ ఛాంపియన్​షిప్​ కు భారత్​ తరపున ప్రాతినిథ్యం వహించి, ఆ పోటీల్లో మూడో స్థానంలో నిలిచారు.అలాగే 2012లో జరిగిన స్థానిక క్రీడా పోటీల్లో పాల్గొని హ్యామర్​ త్రోలో మూడో స్థానాన్ని దక్కించుకున్నారు.2016లో కూడా జాతీయ స్థాయి పోటీల్లో విజేతగా నిలిచి అందరిని ఆశ్చర్యపరిచారు.

Telugu Gujarath, Haresh Desai, Latest-Latest News - Telugu

ఈ మధ్య కాలంలో కూడా వారణాసిలో నిర్వహించిన టోర్నీలో పాల్గొని రెండు పసిడి పతకాలు, ఓ రజత పతకాన్ని సాధించారు.వంద మీటర్ల పరుగు పందెం, షాట్​ పుట్​, హ్యామర్​ త్రో క్రీడల్లో ఆయనకు సాటి ఎవరు రారు అనే చెప్పాలి.నిజంగా ఈ వయసులో కూడా హరేష్ దేశాయ్ క్రీడల్లో ఎంతో ఉత్సహంగా పాల్గొనడం విశేషం అనే చెప్పాలి.

ఈ వయసులో కూడా తాను శారీరకంగా దృఢంగా ఉండేలా పలు జాగ్రత్తలు తీసుకుంటానని అంటున్నారు హరేశ్​.అలాగే రోజుకు అరగంట పాటు వ్యాయామం చేస్తూ ఉంటారట.శారీరక దృఢత్వం పెంపొందించుకుని ప్రతి ఒక్కరు కూడా తమ శరీరం పట్ల ఫిట్​ గా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube