అరుదైన మెడల్ అందుకున్న రహానే.. అసలు మెడల్ చరిత్ర ఏంటంటే..?!

తాజాగా జరిగిన బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ లో టీమ్ ఇండియా ఆస్ట్రేలియా జట్టుపై విజయం సాధించిన సంగతి తెలిసిందే.రెండు ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాను టీమిండియా బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి తక్కువ స్కోరుకే పరిమితం చేయడంతో భారత్ ఆస్ట్రేలియా జట్టును మట్టి కరిపించింది.

 Ajenkya Rehane, Team India, Australia, Player Of The Match, Medal, Rahane Jhoney-TeluguStop.com

కేవలం 4 రోజుల్లోనే టీమిండియా విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ మ్యాచ్ లలో సెంచరీతో కదం తొక్కిన టీమిండియా కెప్టెన్ అజింక్యా రహానే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎన్నికయ్యాడు.

దీంతో టీమిండియా కెప్టెన్ అజింక్య రహానే ఓ ప్రత్యేకమైన మెడల్ ను అందుకున్నాడు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

Telugu Ajenkya Rehane, Australia, Medal, India-Latest News - Telugu

క్రికెట్ ఆస్ట్రేలియా మొట్ట మొదటిసారిగా ప్రవేశ పెట్టిన మెడల్ ను రహానే అందుకున్నాడు.మెడల్ అందుకున్న తర్వాత రహానే మెడలో వేసుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.ఇక ఈ మెడల్ సంబంధించి పూర్తి చరిత్ర ఏమిటంటే.డిసెంబర్ 26 న మొదలయ్యే బాక్సింగ్ డే టెస్టులో ఎవరికైతే బెస్ట్ ప్లేయర్ గా ఎన్నిక అవుతారో వారికి ఈ మెడల్ దక్కనుంది.ఇక ఈ మెడల్ జానీ ములాల్గ్ అనే క్రికెటర్ జ్ఞాపకార్థం అందిస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.

దీంతో ఈ మెడల్ అందుకున్న మొదటి క్రికెటర్ గా అజింక్యా రహానే చరిత్రలో నిలబడిపోయాడు.

Telugu Ajenkya Rehane, Australia, Medal, India-Latest News - Telugu

ఇకపోతే ఈ మెడల్ కు ఓ ప్రత్యేక స్థానం ఉంది.ఇదివరకు ఆస్ట్రేలియా జట్టుకు సారథ్యం వహించిన కెప్టెన్లలో ఒకరైన జానీ ములాల్గ్ క్రికెట్ ఆస్ట్రేలియా కు మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ క్రికెట్ పర్యటనకు వెళ్లిన టీం కెప్టెన్ గా వ్యవహరించారు.డిసెంబర్ 28 న ఈయనను ఆస్ట్రేలియన్ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ లో కూడా చేరడంతో ఆయనకు తగిన మర్యాద ఇవ్వడం కారణంతో ఈ మెడల్ ను ఇవ్వడం ఈ సంవత్సరం నుంచి మొదలు పెట్టారు.

ఈయన తన మొదటి టూర్ లోనే బౌలింగ్ లో కేవలం 10 సగటుతో 24 వికెట్లు నేలకూల్చాడు.బ్యాటింగ్ లో 23 సగటుతో 1698 పరుగులు రాబట్టాడు.

అంతేకాదు ఈయన వికెట్ కీపింగ్ లో కూడా తన పాత్రను పోషించి నాలుగు స్టంపింగ్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube