రాజమండ్రిలో చోటు చేసుకున్న అరుదైన ఘటన.. కొన్ని క్షణాలు మాయమైన నీడ.. !?

విశ్వం ఒక అంతుచిక్కని రహస్యం.ఎన్ని పరిశోధనలు చేసినా, మానవ మేధస్సు ఎంత అభివృద్ధి చెందినా ఇంకా కనిపెట్టలేని ఎన్నో సంఘటనలు, కంటికి కనిపించని అద్భుతాలు అక్కడక్కడ చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

 A Rare Event Sun Shadow Missing For A While In Rajahmundry-TeluguStop.com

ఎంతలా శోధించిన గానీ ఇలాంటి అద్భుతాల మూలం తెలుసుకోవడం కొన్ని సందర్భాల్లో అసాధ్యంగా మారింది.

ప్రస్తుతం ఇలాంటి ఘటనే రాజమండ్రిలో చోటు చేసుకుందట.

 A Rare Event Sun Shadow Missing For A While In Rajahmundry-రాజమండ్రిలో చోటు చేసుకున్న అరుదైన ఘటన.. కొన్ని క్షణాలు మాయమైన నీడ.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఇలాంటి సంఘటన మీద కూడా ఒక సినిమా వచ్చింది.ఇంతకు అంతలా అబ్బురపరిచే అద్భుతం ఏంటని ఆలోచిస్తున్నారా.

అయితే వినండి రాజమండ్రిలో నిన్న కొన్ని క్షణాలపాటు నీడ మాయం అయ్యిందట.నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఎర్రటి ఎండ కాసినా, కాసేపు నీడ మాయమైందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఇక ఈ సంఘటన పై స్పందించిన శ్రీ సత్యసాయి గురుకులం వైస్ ప్రిన్సిపాల్, భూగోళ శాస్త్ర ఉపాధ్యాయుడు, భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక శాఖ అనుబంధ సంస్థ వీఐపీఎన్‌ఈటీ సమన్వయకర్త అయిన గుర్రయ్య మాట్లాడుతూ, నీడ కనిపించకపోవడానికి గల కారణాలు వెల్లడించారు.కాగా ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్న ప్రదేశాల్లో ఏడాదికి రెండుసార్లు ఇలాంటి ఘటనలు కనిపిస్తాయని, ఇలాంటి సమయాల్లో సూర్యకిరణాలు నిట్టనిలువుగా భూమిని చేరడం వల్ల నీడ కనిపించదని వెల్లడించారు.

అదీగాక సూర్యుడు ఉత్తర, దక్షిణ దిశగా పయనిస్తున్నప్పుడు కూడా లాంటి పరిస్థితులు కనిపిస్తాయని పేర్కొన్నారు.ఇకపోతే మరోసారి అంటే ఈ సంవత్సరం ఆగస్టు 5న కూడా ఇక్కడ ఇలాంటి దృశ్యమే కనిపించే అవకాశాలున్నాయని గుర్రయ్య వివరించారు.

#August 5 #Rajahmundry #Sun Shadow #WonderIn #Gurrayya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు