Raccoon America : ఓ చిన్నారిపై దాడి చేసిన రకూన్... తల్లి ఏం చేసిందో తెలుసా?

సోషల్ మీడియాలో నిత్యం అనేకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.వాటిలో కొన్ని చాలా సరదాగా ఉంటే మరికొన్ని ఆశ్చర్యంగా ఉంటాయి.

 A Raccoon That Attacked A Child Do You Know What The Mother Did , Man, Animals,-TeluguStop.com

ఇంకొన్ని విచిత్రం అనిపిస్తే, కొన్ని మాత్రం కాస్త భయంగా అనిపిస్తాయి.ఇక వైరల్ అయిన దాంట్లో ఎక్కువగా జంతువుల వీడియోలు ఉండటం గమనార్హం.

మన దేశంలో సహజంగా ఊర కుక్కలు, ఊర పిల్లులు అనేవి బయట తిరుగుతూ ఉంటాయి.అదే విధంగా అమెరికాలో చూసుకుంటే రకూన్ అనే జంతువులు చాలా కామన్.

రకూన్ అనేది పిల్లి కంటే పెద్దదిగా, కుక్క కంటే చిన్నగా ఉంటుంది.

ఇక ఈ జంతువులు దాదాపు 9 నుండి 10 కేజీల బరువు వరకు పెరుగుతాయి.

సాధారణంగా ఇవి మనుషుల జోలికి రావు.కానీ చాలా రేర్ గా మనుషులపైన ఇవి దాడి చేస్తాయి.

తాజాగా అమెరికాలోని కనెక్టికట్‌లో ఇలాంటి ఓ సంఘటన జరిగింది.ఉదయాన్నే ఓ బాలిక స్కూల్‌కి వెళ్లబోతూ ఇంటి డోర్ తియ్యగానే.

పక్కనుంచి వచ్చిన రకూన్ ఆ పాప కాలు పట్టుకొని కొరకడానికి ప్రయత్నించింది.ఆ బాలిక ఏడుస్తూ కేకలు పెట్టడంతో అలర్టైన తల్లి గబగబా వచ్చి.

ప్రాణాలకు తెగించి మరీ రకూన్‌ని పట్టుకొని.పాపను విడిపించింది.

ఇక్కడ ఆ పాప తల్లి గురించి చెప్పుకోవాలి.ఓవైపు రకూన్ తనను కరుస్తున్నా ఆ తల్లి ధైర్యంగా పోరాడుతూ.పాపని ఇంట్లోకి తీసుకెళ్ళేవరకు పోరాడింది.చిన్నారిని ఇంట్లోకి నెట్టగానే ఇంట్లోవాళ్లెవరూ బయటకు రావొద్దని చెబుతూ.డోర్ వేసేసింది.ఆ తర్వాత రకూన్‌ని పట్టుకొని.

గాల్లోకి విసరడం ఇక్కడ వీడియోలో మనకు కనబడుతోంది.ఈ వీడియోని ట్విట్టర్‌లోని @FightClubVideos అకౌంట్‌లో డిసెంబర్ 4న పోస్ట్ చెయ్యగా.

ఇప్పటివరకూ 26 లక్షల మందికి పైగా చూడటం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube