పవన్ కళ్యాణ్ కి నిద్రలేకుండా చేస్తున్న....“ప్రశ్న”...???  

A Question That Not Making Pawan Kalyan To Sleep -

ఏపీలో ఎన్నికల హడావిడి అంతా అయిపొయింది.ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో పోలింగ్ జరిగిందని ఈ సారి టీడీపీ అధికారం చేజార్చుకోవడం తధ్యం అంటూ విశ్లేషకులు తమ అభిప్రాయాలని వ్యక్తం చేస్తుంటే.

A Question That Not Making Pawan Kalyan To Sleep

టీడీపీ నేతలు సైతం ఇది నిజమే అన్నట్టుగా విషాద వదనాలతో మీడియాకి సైతం చిక్కకుండా తిరుగుతున్నారు.ఇదిలాఉంటే వైసీపీ పార్టీ మాత్రం ఫుల్ జోష్ లో ఉంది.

ఈసారి తప్పకుండా అధికారం తమదేననే ఫుల్ కాన్ఫిడెంట్ తో వైసీపీ ఖుషీ ఖుషీ గా ఉంది.

పవన్ కళ్యాణ్ కి నిద్రలేకుండా చేస్తున్న….ప్రశ్న…-Political-Telugu Tollywood Photo Image

ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారిగా పాల్గొని అధికారంలోకి రావాలని ఆశపడ్డ జనసేన పార్టీ , ఎలాగో అధికారంలోకి రాదన్న విషయం ముందు నుంచీ అందరికి తెలిసిందే.

ఇదే విషయం పవన్ కి కూడా తెలిసినా ఓ పొలిటికల్ పార్టీని ముందుకు నడిపే వ్యక్తిగా చాలా వ్యుహత్మకంగానే వ్యవహరించాడు.అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.??? వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ ప్రతిపక్షంలో ఉంటుంది పోరు చేస్తుంది.మరి జనసేన పరిస్థితి ఏమిటి.?? నెక్స్ట్ ఏంటి.?? అనే ఈ ఒక్క ప్రశ్న జనసేనలో ప్రతీ ఒక్కరిని కుమ్మరి పురుగు తొలిచినట్టుగా తొలిచేస్తోందట.

జనసేన పార్టీ ఓడిపోతే పవన్ కళ్యాణ్ ఏమి చేస్తారు…?? నెక్స్ట్ ఏంటి.?? నేతల భవిష్యత్తు ఏమిటి.?? తననే నమ్ముకుని ఉన్న నేతల, అభిమానుల భవితవ్యం ఏమిటి.?? అనే లెక్కకి మించిన ప్రశ్నలు వెల్లువలా పవన్ ని చుట్టూ ముడుతున్నాయి.పవన్ అయితే ఎంచక్కా సినిమాలు చేసుకుంటూ ఉంటారు ఆయన భవిష్యత్తుకి డోకా లేదు.మరి పవన్ వీరావేస ప్రసంగాలు చూసి స్థానిక నాయకులపై చిర్రుబుర్రులాడిన లోకల్ నేతలు, కార్యకర్తల పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదట.

అయితే పవన్ కళ్యాణ్ ముందు ముందు ఎలాంటి భరోసా ఇస్తారోనని ఆశగా ఎదురు చూస్తున్నారట కొందరు నేతలు.అయితే పోలింగ్ జరిగింది మొదలు ఎన్నో గొడవలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నా ఇప్పటి కూడా పవన్ కళ్యాణ్ నోరు మెదపలేక పోవడంతో, ఎన్నికల రిజల్స్ తరువాత పవన్ ఏమి చేస్తారు, ఎలాంటి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటారు అనే విషయంపై తర్జనభర్జన పడుతున్నారట.

ఇంతకీ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఏంటి.???

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు