అమెరికా తూర్పు తీరంలో బలమైన మంచు తుఫాన్ల కారణంగా జనజీవనం స్థంభించింది.థాంక్స్‌గివింగ్ హాలీడే వీకెండ్ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో విహారయాత్రకు వెళ్లిన వారు అక్కడే చిక్కుకుపోయారు.
బఫెలో నయాగర అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ విమానం ల్యాండ్ అవుతూ రన్ వేపై జారిపడినట్లు నయాగరా ఫ్రాంటియర్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ తెలిపింది.
వెస్ట్ వర్జీనియా రాష్ట్ర సరిహద్దుకు 25 మైళ్ల దూరంలోని మేరీల్యాండ్ గారెట్ కౌంటీలో ఇంటర్ స్టేట్ రహదారి 68లో 25 వాహనాలు మంచులో దారి కనిపించగా ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి.
ఈ ప్రాంతంలో మంచు తుఫాను కురిసే అవకాశం ఉందని నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది.కాగా దక్షిణ డకోటాలోని ఛాంబర్‌లైన్‌లో మంచు తుఫాను కారణంగా ఓ విమానం కూలిపోయి తొమ్మిది మంది మరణించిన సంగతి తెలిసిందే.

ఆదివారం అమెరికాలో అత్యంత రద్దీ అయిన ప్రయాణ దినం.అయితే మంచు తుఫాను కారణంగా దేశవ్యాప్తంగా విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.అమెరికన్, డెల్టా మరియు ఇతర విమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేయడమో లేదంటే దారి మరల్చడమో చేశాయి.మొత్తంగా ఆదివారం సాయంత్రం అమెరికా వ్యాప్తంగా 6,500 డొమెస్టిక్, ఇంటర్నేషనల్ సర్వీసులు ఆలస్యంగా నడిచాయి.
అలాగే 800కి విమానాలు రద్దు చేయబడ్డాయి.
తుఫాను ప్రభావం సోమవారం వరకు కొనసాగే అవకాశం ఉంది వాతావరణ శాఖ తెలిపింది.
దాదాపు 50 మిలియన్ల మంది ప్రజలు మంచు తుఫాను ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది.దేశంలోని ఈశాన్య ప్రాంతాన్ని భయపెడుతున్న తుఫాను ఇప్పటికే ఎగువ మిడ్‌వెస్ట్‌ను వణికించింది.
ఇదే సమయంలో పశ్చిమ ప్రాంతంలో మంచు తుఫాను, వరదలతో పాటు కరెంట్ కోతలు సంభవిస్తున్నాయి.డకోటా నుంచి మిచిగాన్ వరకు 12 అంగుళాల మేర మంచు పేరుకుపోయింది.