వైరల్‌ : వారిద్దరు స్నేహితులు, వారు తీసుకున్న సెల్ఫీ ఒక ఆశ్చర్యకర విషయం వెళ్లడయ్యేలా చేసింది  

a photo helps a mother to identify her twin daughter - Telugu , Kyacid Nurse And Mise Solomans Schools Friends, Selfie Photo Viral In Social Media, Twin Daughter, Twin Sisters

పాత సినిమాల్లో కవల పిల్లలుగా పుట్టి చిన్నతనంలోనే ఏదో కారణం వల్ల విడిపోవడం, పెద్దవాళ్లు అయిన తర్వాత కలవడం వంటివి మనం చాలా చూశాం.ఎన్టీఆర్‌ అదుర్స్‌ చిత్రంలో ఇలాంటి కథే ఉంటుంది.

A Photo Helps A Mother To Identify Her Twin Daughter

ఇంకా అంతకు ముందు ఎన్నో సినిమాల్లో కూడా ఇది చూశాం.కాని నిజ జీవితంలో మాత్రం అలాంటివి జరగవు అనుకుంటాం.

అయితే నిజ జీవితంలో సినిమాలో ఎలా అయితే జరిగిందో అచ్చు అలాగే జరిగింది.దక్షిణాఫ్రికాలోకి కేప్‌టౌన్‌లో ఈ సంఘటన జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.క్యాసిడ్‌ నర్స్‌ మరియు మిషే సోలొమాన్‌లు స్కూల్‌లో స్నేహితులు.వీరిద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉండే వారు.ఇద్దరు కూడా చాలా క్లోజ్‌గా ఉండటంతో పాటు ఇద్దరు సేమ్‌ ఉండటం వల్ల వారిద్దరిని స్కూల్‌ వారు అంతా కూడా సిస్టర్స్‌ అనే వారు.

ఇద్దరు చాలా కాలం చాలా క్లోజ్‌గా ఉంటూ రావడం జరిగింది స్కూల్‌లో ఒక రోజు కల్చరల్‌ యాక్టివిటీ కార్యక్రమం నిర్వహించారు.ఆ రోజున క్యాసిడ్‌ నర్స్‌ మరియు మిషేలు సెల్ఫీ తీసుకున్నారు.

ఆ సెల్ఫీని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.క్యాసిడ్‌ నర్స్‌ తల్లి సెలెస్టే నర్స్‌ ఆ సెల్ఫీని చూసి ఆశ్చర్యపోయింది.ఇద్దరు ఒకేలా ఉండటం చూసి ఆమె అనుమానం వ్యక్తం చేసింది.మిషే పుట్టిన రోజు తెలిసి సెలెస్టే నర్స్‌ మరింత ఆశ్చర్య పోయింది.అప్పుడే తన డెలవరీ సమయంలో మిస్‌ అయిన బిడ్డ గురించి సెలెస్టేకు జ్ఞాపకం వచ్చింది.తన అనుమానం నివృత్తి చేసుకునేందుకు మిషే సోలొమాన్‌ను డీఎన్‌ఏ టెస్టు చేయించుకోవాల్సిందిగా సెలెస్టే కోరింది.

అందుకు ఒప్పుకున్ను మిషే డీఎన్‌ఏ టెస్టు చేయించుకోవడంతో సెలెస్టే కూతురు అని తేలింది.మిషేను పుట్టిన మూడు రోజులకే లవానో ఎత్తుకు వెళ్లింది.పాపను ఎత్తుకు వెళ్లిన లవానో ఇన్ని రోజులు బాగానే పెంచింది.తనను పెంచిన తల్లి ఒక దొంగ అని మిషే చాలా బాధపడింది.లవానోపై కేసు పెట్టిన సెలెస్టే తన ఇద్దరు బిడ్డలు తన వద్దకు రావడంతో చాలా సంతోషించింది.ఈ సంఘటన ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌ అవుతోంది.

#Twin Sisters #Twin Daughter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

A Photo Helps A Mother To Identify Her Twin Daughter Related Telugu News,Photos/Pics,Images..