కుక్కను పెంచుకుంటే ప్రాణానికి ప్రమాదమా?

కుక్కలు విశ్వాసానికి ప్రతీక అని అంటారు.అందులో సందేహం లేదు.

 A Pet Dog Can Also Harm Your Health-TeluguStop.com

అన్నం పెడుతున్నవారితో ఎంత ప్రేమగా ఉంటుందో, అనామకులతో అంతే రౌద్రంగా ప్రవర్తిస్తుంది.అనుమానం రావాలే కాని, వారి శరీరం మీద దాడి చేస్తుంది.

రక్షణ కోసం కుక్కలు బాగా పనికివస్తాయి.ఇంట్లో ఆడుకోవడానికి కూడా చూడముచ్చటగా ఉంటాయి.

కాని కుక్కలతో ప్రమాదం కూడా ఉంది.అవి ఎదురుతిరిగి మనల్ని కరవనక్కరలేదు.

ఎప్పుడూ ప్రేమగా, విశ్వాసంగా ఉన్న ప్రమాదం వచ్చే అవకాశం ఉంది.

వాషింగ్‌టన్ లో ఒక ముసలావిడని ఈమధ్యే ఐసియూలో పెట్టారు.

కారణం అక్యూట్ కిడ్నీ ఫేల్యూర్.వింతగా, ఇది ఆవిడ అలవాట్ల వల్లో, వంశపారంపర్యంగానో రాలేదు.

తను ఇటలీ నుంచి తెచ్చి పెంచుకుంటున్న ఓ కుక్క వల్ల వచ్చింది.డాక్టర్లు పరిశీలిస్తే కుక్కలు, పిల్లుల నోట్లో ఇంఫెక్షన్ వల్ల వచ్చే ఒక బ్యాక్టీరియా ఈ ముసలావిడ శరీరంలోకి చేరిందట.

అందువల్లే మాటపడిపోవడం, తలనొప్పి, మోషన్స్ , జ్వరంతో మొదలై కిడ్నీ ఫేల్యూర్ దాకా లాగేసింది ఆ బ్యాక్టీరియా.

ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఆ కుక్క ముసలావిడను కరవలేదు, కొరకలేదు.

ఒంటి మీద ఒక్క గాటు కూడా లేదు.కుక్కతో ఆడి, చేతుల్ని సరిగా శుభ్రపరచుకోకపోవడం వల్లే ఆ బ్యాక్టీరియా పెద్దావిడ శరీరంలోకి ప్రవేశించవచ్చు అని చెబుతున్నారు డాక్టర్లు.

చూసారా ఎంత పెద్ద ప్రమాదమో.కుక్కను పెంచుకోవాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించి తెచ్చుకోండి.

ఇప్పటికే పెంచుకుంటూ ఉంటే, జాగ్రత్తగా ఉండండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube