డాక్టర్ అయినా, నర్స్ అయినా రోగి ఆరోగ్యం కుదుటపడేందుకు నానా తిప్పలు పడుతున్నారు.ఓ వైపు అవసరమైన మెడిసన్స్ అందిస్తూనే మరో వైపు రోగి మానసికస్థితిని కూడా ఉల్లాస పరిచేందుకు కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు.
అటువంటి ఘటనే ఒకటిప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఎక్కడ జరిగిందో తెలియదు కాని రోగి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకున్న ఆ సిబ్బందిని నెటిజన్స్ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ఓ ఆస్పత్రిలోని బెడ్‌పై పక్షవాతం వచ్చి కదల్లేకుండా ఉన్న రోగిని బుల్లెట్టు సాంగ్ పెట్టి ఓ నర్సు చేసిన డ్యాన్సు చేయడంతో రోగి శరీర భాగాల్లో కదలికలు వచ్చాయి.ఆ పాట పెట్టి నర్సు సాంగ్ చేయడం ప్రారంభించడంతో పేషేంట్ స్పందించి పడిపోయిన చేయిని పైకి లేపి చిటికెలు వేస్తూ ఉత్సాహం చెందాడు.
ఆమె చేసిన స్టెప్పులను అనుకరించే ప్రయత్నం చేస్తూ వ్యాధి నుంచి కోలుకునేందుకు మానసిక స్థితిని మెరుగుపరుచుకున్నాడు.ప్రస్తుతం ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
పక్షవాతం వచ్చి కదలకుండా ఉన్న అతడిని తిరిగి మామూలు స్థితికి తీసుకొచ్చేందుకు ఆ నర్సు చేసిన కృషిని చాలా మంది కొనియాడుతున్నారు.
సంగీతానికి చింతకాయలు రాలుతాయే లేదో కానీ రోగి శరీరం మాత్రం స్పందించింది అని పలువురు కామెంట్ చేస్తున్నారు.అయితే బుల్లెట్టు బండి అనే పాటపై ఓ పెండ్లి కూతురు చేసిన డ్యాన్స్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే.ఇప్పుడు అదే పాట మీద ఓ పేషేంట్‌ను మామూలు స్థితికి ఆ సిస్టర్ కష్టపడ్డ తీరు కూడా అందరి నుంచి మెప్పు పొందుతోంది.
ఇలాంటి ప్రోత్సాహం అనేది ప్రతి రోగిని కూడా మంచిగా మారుస్తుందంటే ఇలాంటివి ఎన్ని చేసినా తక్కువే అంటూ అందరూ కామెంట్లు పెడుతున్నారు.